Telangana DSC Results : తెలంగాణ‌లో డీఎస్సీ ఫ‌లితాలు విడుద‌ల‌.. 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సీ ఫ‌లితాలు వ‌చ్చేశాయి.

Telangana DSC Results : తెలంగాణ‌లో డీఎస్సీ ఫ‌లితాలు విడుద‌ల‌.. 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్‌

CM Revanth Reddy released Telangana DSC Results 2024

Updated On : September 30, 2024 / 1:29 PM IST

తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సీ ఫ‌లితాలు వ‌చ్చేశాయి. సోమ‌వారం స‌చివాలయంలో ఫ‌లితాల‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుద‌ల చేశారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. కేవలం 55 రోజుల్లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశామ‌న్నారు. 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్‌ ఉంటుందన్నారు. అక్టోబ‌ర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేస్తామ‌ని చెప్పారు. గ‌త ప‌దేళ్ల‌లో భారాస ప్ర‌భుత్వం ఒకే ఒక డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను ఇచ్చింద‌ని, అది కూడా కేవ‌లం 7 వేల పోస్టుల‌తోనే విడుద‌ల చేసింద‌ని విమ‌ర్శించారు.

ప్ర‌స్తుతం జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా మాత్ర‌మే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. డీఎస్సీ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in/ISMS/ లేదా https://tgdsc.aptonline.in/tgdsc/ లో తెలుసుకోవ‌చ్చు. అయితే.. ఫ‌లితాల్లో మార్కులు, ర్యాంక్ మాత్ర‌మే ఉంటుంది. మెరిట్ క‌మ్ రోస్ట‌ర్ ప్ర‌కారం సెలెక్టెడ్ లిస్టును జిల్లాల వారీగా డిఈఓల‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

హైకోర్టును ఆశ్రయించిన మూసీ నిర్వాసితులు.. ఇళ్ల ముందు వెలసిన కోర్టు స్టే బోర్డులు..

ధ్రువపత్రాల పరిశీలన అనంతరం సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ ప్ర‌భుత్వం ఈ ఏడాది మార్చి 1న 11,602 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. జూలై 18 నుంచి ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు ప‌రీక్షల‌ను నిర్వ‌హించారు. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. ఆగ‌స్టు 13 ప్రిలిమిన‌రీ కీని రాష్ట్ర విద్యాశాఖ విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 20 వ‌ర‌కు అభ్యంత‌రాలు స్వీక‌రించారు. సెప్టెంబ‌ర్ 6న ఫైన‌ల్ కీను విడుద‌ల చేశారు.