ఒకే కార్డులో రేషన్, ఆరోగ్య, ఇతర పథకాల వివరాలు..! ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ సమీక్ష..
బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసరమైన సమాచారం సేకరించాల్సిన పని లేదన్నారు.

Family Digital Card (Photo Credit : Google)
Family Digital Card : ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. డిజిటల్ కార్డులపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించనున్న డిజిటల్ రేషన్ కార్డులో ఇక నుంచి మహిళే యజమానిగా ఉండనున్నారు. ఒకే కార్డులో రేషన్, ఆరోగ్య, ఇరత పథకాల వివరాలు ఉండనున్నాయి. రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాలని నిర్ధారించనున్నారు.
Also Read : 9 లక్షలు మాత్రమే చేస్తారా? పార్టీ శ్రేణులపై జేపీ నడ్డా సీరియస్..
ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసరమైన సమాచారం సేకరించాల్సిన పని లేదన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో పైలెట్ గా రెండు ప్రాంతాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ, వాటిలో ఎలాంటి విషయాలు పొందుపరచాలి అనే అంశానికి సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో రేపు అందించనున్నారు.
ప్రస్తుతం రేషన్ కు ఒక కార్డు, ఆరోగ్యానికి సంబంధించి మరొక కార్డు, ఇతర పథకాలకు సంబంధించి మరొక కార్డు.. ఇలా వేర్వేరు కార్డులు ఉన్నాయి. అయితే, ఇక ముందు ఇలా కాకుండా ఒకే కార్డులో అన్ని వివరాలు ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అదే ఫ్యామిలీ డిజిటల్ కార్డు. ఒకే కార్డును మెయింటేన్ చేసేలా చూడాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.