CM Revanth Reddy Speech in gaddar jayanti program
Cm Revanth Reddy : కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకోసారి గద్దర్ మీద కామెంట్స్ చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. మీ పార్టీ కార్యాలయాలు ఉన్న చోట గల్లీలకు గద్దర్ అన్న కాలనీ అని పేరు పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడు మీ అడ్రస్ చెప్పుకోవడానికి కూడా గద్దర్ పేరు చెప్పుకోవాల్సి వస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ ని ఉద్దేశించి అన్నారు.
కేసీఆర్ కు పట్టిన గతే మీకూ పడుతుంది..
కేసీఆర్ గద్దర్ ను లోపలికి పిలవకపోతే ఆయన గడీలు బద్దలయ్యాయని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్.. అక్కడ లేకుండా వెళ్లిపోయారని చెప్పారు. కేసీఆర్ కు పట్టిన గతే మీకూ పడుతుందని బండి సంజయ్ ను హెచ్చరించారాయన. కేసీఆర్ పరిస్థితే అలా అయితే, ఇక మీరెంత? అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మీరు అడ్రస్ ఉండరని అన్నారు.
Also Read : ఫామ్ హౌస్ లో మాట్లాడటం కాదు, అసెంబ్లీకి రండి చర్చిద్దాం- కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్
గద్దర్ కు పద్మశ్రీ ఇవ్వనంత మాత్రాన.. ఆయన గౌరవం తగ్గదు..
అహంకారం పనికి రాదని కేంద్రమంత్రి బండి సంజయ్ కి హితవు పలికారు సీఎం రేవంత్. సైద్ధాంతిక అభిప్రాయ బేధాలు ఉండొచ్చు కానీ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. గద్దర్.. అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారని రేవంత్ చెప్పారు. గద్దర్ కు పద్మశ్రీ ఇవ్వనంత మాత్రాన.. ఆయన గౌరవం తగ్గదని తేల్చి చెప్పారు. గద్దర్ గౌరవాన్ని ఆకాశమంత పెంచేలా మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది..
హైదరాబాద్ రవీంద్రభారతిలో గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గద్దర్ ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇలా తీవ్రంగా స్పందించారు. అవార్డులు తమ వద్ద ఉన్నాయని బీజేపీ భావిస్తుందేమో కానీ, మీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉందని గుర్తుంచుకోవాలన్నారు. అందుకే మీ పార్టీ ఉన్న కాలనీకి గద్దరన్న పేరును పెడతానని రేవంత్ రెడ్డి అన్నారు.
”అధికారంలో ఉన్న వారు గద్దర్‌ను గేటు బయట నిలబెట్టారు. కానీ ఇప్పుడాయన గద్దె కూలిపోయింది. ఇప్పుడు గద్దరన్న వారసుడు అధికారంలో ఉన్నాడు. గద్దరన్నను గేటు బయట నిలబెట్టిన వ్యక్తి బయట ఉన్నాడు. గద్దరన్నను గేటు బయట కూర్చోబెట్టిన వారికి ఏ గతి పట్టిందో గద్దరన్నను విమర్శించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుంది” అని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Also Read : నేను కొడితే మామూలుగా ఉండదు..!- కార్యకర్తలతో కేసీఆర్ హాట్ కామెంట్స్
మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేలా చేస్తా..
”మీరు కానీ, మీ పార్టీ కానీ.. గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే ఊరుకోను. మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేలా చేస్తా” అంటూ బీజేపీని, కేంద్రమంత్రి బండి సంజయ్‌ని ఉద్దేశించి నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.