Somesh Kumar: భారీ స్కామ్.. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై కేసు

వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై..

Somesh Kumar: భారీ స్కామ్.. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై కేసు

కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ-5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరును చేర్చారు.

సోమేశ్ కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు చేశారు. సీసీఎస్‌లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరుగుతోంది.

ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌లో చెల్లింపుల్లో 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ ఇన్వాయిస్ లు సృష్టించి నిందితులు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు.

ఫోరెన్సిక్‌ అడిట్‌లో ఈ అవకతవకలు వెలుగు చూశాయి. మాజీ సీఎస్‌ సోమేశ్ సూచనలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. స్కామ్‌ కు పాల్పడ్డ నిందితులపై 406, 409, 120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. త్వరలో నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించనున్నారు.

Also Read: గోల్డ్‌ రేట్లు తగ్గడానికి సుంకం తగ్గింపే కారణమా?