Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై డౌట్స్ ఉన్నాయా..? మీకో అప్డేట్..
ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై మీకు సందేహాలున్నాయా..? సర్వేయర్ సందర్శించలేదా..? సర్వే సక్రమంగా జరగలేదా... మీ సందేహాలను, ఫిర్యాదులను ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చు..

Indiramma Illu
TS Indiramma Illu 2025: ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై మీకు సందేహాలున్నాయా..? సర్వేయర్ సందర్శించలేదా..? సర్వే సక్రమంగా జరగలేదా..? సర్వే సమయంలో గైర్హాజర్ అయ్యారా.. ప్రజాపాలనలో దరరఖాస్తు చేయలేదా..? మీకు ఎలాంటి సందేహాలున్నా వాటిని నివృత్తి చేసుకొనేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రత్యేక వెబ్ సైట్ తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా మీరు చేసుకున్న దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు, సర్వే నిర్వహణపై ఫిర్యాదులకు అవకాశం కల్పించారు.
తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్న సంకల్పంతో ఉంది. దీంతో ప్రజల నుంచి ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించి సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు. అయితే, జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకుందుకు అవకాశం కల్పించారు. అయితే, సర్వే సమయంలో పలువురు దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవటంతో సిబ్బంది ఏ విధంగా నమోదు చేశారు.. ఇందిరమ్మ ిళ్ల పథకంలో తమ దరఖాస్తు పరిస్థితి ఏమిటో సమాచారం తెలియక చాలా మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అటు జీహెచ్ఎంసీ కార్యాలయానికి, ఇటు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. మరోవైపు కలెక్టర్ ప్రజావాణిలోనూ పెద్దెత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రత్యేక వెబ్ సైట్ తీసుకొచ్చింది. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా.. ఫిర్యాదులు చేయాలనుకున్నా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది.
Also Read: VLTD : ఇకపై ట్రాన్స్‌పోర్ట్, గూడ్స్ వాహనాలకు ఆ డివైజ్ మస్ట్..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
తొలుత ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో సర్వేపై సందేహాలు ఉంటే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ అవకాశం కల్పించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో రోజూ 150 కిపైగా ఫిర్యాదులు అందుతున్నాయట. ఫిర్యాదులకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు ఆన్ లైన్ లో జాబితాను రూపొందిస్తున్నారు.
దరఖాస్తు స్థితి ఇలా తెలుసుకోండి..
https://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్ ను గూగుల్ లో నమోదు చేయగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అప్లికేషన్ సెర్చ్ ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఆధార్, అప్లికేషన్ ఐడీ, రేషన్ కార్డు అంశాల్లో ఏదో ఒక వివరాలు నమోదు చేయగానే అప్లికేషన్ వివరాలు వస్తాయి. సర్వే స్థితి, అది ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవచ్చు.
అభ్యంతరాలుంటే ఫిర్యాదులు చేయొచ్చు..
♦ ఇందిరమ్మ ఇళ్ల సర్వే వివరాల నమోదుపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసుకోవచ్చు.
♦ ఇందుకోసం https://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తరువాత గ్రీవెన్స్ ఎంట్రీపై క్లిక్ చేయాలి. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే మన ఫోన్ కు ఓటీపీ వస్తుంది.
♦ ఓటీపీ ఎంటర్ చేయగానే ఫిర్యాదు పేజీ ఓపెన్ అవుతుంది.
♦ మన ఆధార్ నెంబర్ నమోదు చేయగానే పలు వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదు చేయాలి.
♦ గ్రీవెన్స్ కేటగిరిపై క్లిక్ చేయగానే.. పలు విభాగాలు మీకు కనిపిస్తాయి.
♦ అందులో సర్వేయర్ సందర్శించలేదు, సంతృప్తి చెందలేదు, సర్వే సక్రమంగా జరగలేదు, సర్వే సమయంలో గైర్హాజర్ అయ్యారు, ప్రజాపాలనలో దరఖాస్తు చేయలేదు. మధ్యవర్తితో సమస్యలు, డబ్బులు డిమాండ్ చేస్తున్న సర్వేయర్.. వీటిలో దరఖాస్తుదారుడు ఎదుర్కొన్న సమస్యను ఎంచుకుని ఫిర్యాదు వివరాలు రాయాల్సి ఉంటుంది.
♦ అనంతరం ఏదేని ధ్రువపత్రాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ పై నొక్కాలి.
♦ వెంటనే మొబైల్ ఫోన్ కు ఫిర్యాదు నెంబర్ వస్తుం ది. కొద్ది రోజుల తర్వాత ఫిర్యాదు వివరాలు తెలుసుకోవచ్చు.