Congress : అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు.. ఒకే కుటుంబం – ఒకే టికెట్ పై వాడీ వేడీ చర్చ.. రేవంత్, ఉత్తమ్ మధ్య వాగ్వాదం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు పీఈసీ గాంధీభవన్ లో సమావేశం అయింది.

Congress candidates selection
Revanth Reddy – Uttam Kumar Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల వార్ జోరుగా నడుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తుల వడపోత చేపట్టడంతో కాంగ్రెస్ లో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. గాంధీ భవన్ లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ(పీఈసీ) ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. పార్టీలో రెండు టికెట్ల విషయంలో జరిగిన చర్చ వాగ్వాదానికి దారి తీసింది. ఒకే కుటంబానికి రెండు టికెట్లు ఇచ్చేఅంశంపై అధిష్టానంతో చర్చించాలని ఉత్తమ్ అడగ్గా, తనను డిక్టేట్ చేయొద్దంటూ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
దీంతో ఆగ్రహానికి గురైన ఉత్తమ్ మీటింగ్ మధ్యలో నుంచే వెళ్లి పోయారు. ఈ వాగ్వాదం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సెగలు రేపుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు పీఈసీ గాంధీభవన్ లో సమావేశం అయింది. దాదాపు మూడున్నర గంటలపాటు కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సామాజిక వర్గాల వారీగా కేటాయించిన స్థానాలపై చర్చ జరిగింది.
Telangana Congress: బీజేపీలోని ఐదుగురు ముఖ్యనేతలపై ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ!
మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. బీసీల లెక్క తేల్చాలని వీహెచ్, ఏ ప్రాతిపదికన సర్వేలు చేశారని బలరాం నాయక్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఒకే కుటుంబానికి రెండు టికెట్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాట వేసే ప్రయత్నం చేశారు. సెప్టెంబర్ 2న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
బీసీల కోసం తాను నల్లగొండ టికెట్ ను త్యాగం చేసేందుకు సిద్ధమన్నారు. సమర్థవంతమైన వాళ్లకే టికెట్లు ఇస్తామని తెలిపారు. తన నియోజకవర్గంలో కూడా ఆరు అప్లికేషన్స్ వచ్చాయని, అందరి బలాబలాలను పరిశీలిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం బడుగు, బలహీన వర్గాలకు సీట్ల కేటాయింపు జరగాలన్నారు. అయితే ఇప్పటికే 40 సీట్లపై కాంగ్రెస్ అధిష్టానం పూర్తిస్థాయిలో పరిశీలన చేసి, ప్రకటించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.