Revanth Reddy
Padma Awardees : పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ. 25లక్షలు అందజేస్తామని , అదేవిధంగా నెలకు రూ. 25వేల పెన్షన్ అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం శిల్పకళా వేదికగా సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారిని సన్మానించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం, సరికొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాలని చేసిన కార్యక్రమం. తెలుగు కళాకారులు ఎక్కడ ఉన్నా గౌరవించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : Chiranjeevi : నంది అవార్డుకు గద్దర్ పేరు పెట్టడంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు
గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న కవులు, కళాకారులు ఒకానొక పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే దుర్భర పరిస్థితులు ఉంటున్నాయని రేవంత్ అన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో రాణించిన వారిని గుర్తించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.
వెంకయ్యనాయుడును సన్మానించడం మనల్ని మనమే సన్మానించుకోవడమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్ది దిక్కు అని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడుకు రాష్ట్రపతి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. అప్పట్లో జైపాల్ రెడ్డి, వెంకయ్య జంటకవుల్లా ఉండేవారు.. ప్రజలకోసం పరితపించేవారని రేవంత్ అన్నారు.