Chiranjeevi : నంది అవార్డుకు గద్దర్ పేరు పెట్టడంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు

నంది అవార్డులపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. మాట అనడం.. మాట పడటం తన వల్ల కాదని అందుకే రాజకీయాలకి తాను పనికిరాలేదేమో అంటూ మాట్లాడారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi : నంది అవార్డుకు గద్దర్ పేరు పెట్టడంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు

Chiranjeevi

Chiranjeevi : నంది అవార్డుకు గద్దర్ పేరు పెట్టడం సముచితమన్నారు మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. రాజకీయాల్లో మాట అనడం.. మాట పడటం తనవల్ల కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసారాయన.

Guntur Kaaram : గుంటూరు కారం ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుండో తెలుసా?

కేంద్రం ఇటీవల పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలను హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా సత్కరించింది. పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్యలకు సత్కారం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Padma Awardees : శిల్పకళా వేదికగా వెంకయ్య నాయుడు, చిరంజీవిసహా పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానం

ఈ కార్యక్రమంలో చిరంజీవి నంది అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేసారు. గద్దర్ పేరున నంది అవార్డులు ఇవ్వడం సముచితమన్నారు. కొన్నేళ్లుగా నంది అవార్డులు చరిత్రలాగ మిగిలిపోయాయని.. తమను నెగ్లెక్ట్ చేస్తున్నారనే నిరుత్సాహంలో కళాకారులు ఉన్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో చిరంజీవి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చిరంజీవి ధన్యవాదాలు చెప్పారు. తనతో పాటు పద్మవిభూషణ్‌కు ఎంపికైన వెంకయ్యనాయుడుకు చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయాలు రాను రాను దుర్భాషలు వ్యక్తిగత విమర్శలతో దిగజారిపోతున్నాయంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసారు. వెంకయ్యనాయుడు వంటి ఎంతో హుందాతనం ఉన్న వ్యక్తులు సైతం ఇప్పటి రాజకీయాలను చూసి బాధపడుతున్నారని అన్నారు. మాట అనడం.. మాట పడటం తన వల్ల కాదని అందుకే రాజకీయాల్లో తాను అన్ ఫిట్ అనుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. నోరు జారే వాళ్లను, దుర్భాషలాడే వారిని, వ్యక్తిగత విమర్శలు చేసేవారిని తిప్పి కొట్టే శక్తి ..సరైన నాయకులను నిర్ణయించే శక్తి  ప్రజలకు ఉందని వారే సమాధానం చెప్పాలని చిరంజీవి మాట్లాడారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.