Allu Arjun Arrest : ఉద్దేశపూర్వకంగానే రాత్రంతా జైల్లో ఉంచారు- అల్లు అర్జున్ లాయర్ కీలక వ్యాఖ్యలు..

ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ లాయర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే.. కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

Allu Arjun Arrest : ఉద్దేశపూర్వకంగానే రాత్రంతా జైల్లో ఉంచారు- అల్లు అర్జున్ లాయర్ కీలక వ్యాఖ్యలు..

Allu Arjun Case (Photo Credit : Google)

Updated On : December 14, 2024 / 5:00 PM IST

Allu Arjun Arrest : పోలీసులపైన కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని ప్రకటించారు అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి. అల్లు అర్జున్ ను తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశించిందని.. అయినా రాత్రంతా ఉద్దేశపూర్వకంగానే జైల్లో ఉంచారని ఆరోపించారు. బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యం చేయడం కోర్టు ధిక్కరణే అని అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులపైన కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని లాయర్ అశోక్ రెడ్డి చెప్పారు.

అల్లు అర్జున్ విడుదలపై హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ను చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి, కచ్చితంగా దీనిపై న్యాయపరమైన పోరాటం చేస్తామని అల్లు అర్జున్ తరపు లాయర్ అశోక్ రెడ్డి చెప్పారు. అర్ణబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చిన జడ్జిమెంట్ లో ఒక్కరోజు కూడా అర్ణబ్ గోస్వామి జైల్లో లేడు, వెంటనే విడుదల కావడం జరిగింది. కానీ, అల్లు అర్జున్ విషయంలో మాత్రం.. కోర్టు చెప్పినప్పటికీ జైలు అధికారులు తాత్సారం చేశారని, ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని, దీన్ని కచ్చితంగా కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తామని అల్లు అర్జున్ లాయర్ అశోర్ రెడ్డి చెప్పారు.

చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ వెర్షన్ మరోలా ఉంది. లీగల్ ప్రాసెస్ కు సంబంధించి హైకోర్టు బెయిల్ ఆర్డర్ కాపీ మాకు సకాలంలో అందలేదన్నారు. మరోవైపు జైలుకు సంబంధించి కొంత ప్రాసెస్ ఉంటుందని, దాని ప్రకారమే తాము నడుచుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తొలుత ఆన్ లైన్ లో పెట్టిన కాపీని తీసుకొచ్చారు, ఆ తర్వాత మ్యానువల్ గా కూడా ఒక కాపీని తీసుకొచ్చారు. అయితే, అందులో కొన్ని తప్పులు ఉండటంతో కాపీని తిరిగి పంపించామన్నారు. ఈ తెల్లవారుజామున ఆర్డర్ కాపీస్ తమకు అందాయని, ఆ వెంటనే అల్లు అర్జున్ విడుదల అయ్యాడని జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ లాయర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే.. కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక ఖైదీని విడుదల చేయాలంటే ప్రొసీడింగ్స్ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ప్రాసెస్ ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని జైలు అధికారులు తెలిపారు.

 

Also Read : జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. అరెస్టుపై కీలక వ్యాఖ్యలు