తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్తగా 6 కేసులే నమోదు అయ్యాయి

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

Coronavirus Cases Decreasin

Updated On : December 6, 2021 / 1:14 PM IST

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్తగా 6 కేసులే నమోదు అయ్యాయి

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్తగా 6 కేసులే నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 650కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 118 మంది డిశ్చార్జ్ అయ్యారు. 18 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనా కట్డడికి తీసుకుంటుున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చినట్లేనని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా కంటైన్మెంట్లను ఏర్పాటు చేయడం ఫలించింది. ఈ ప్రాంతాల పరిధిలోనే పాజిటివ్ కేసులు, వారి కాంటాక్టులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. దీంతో వైరస్ ఆయా ప్రాంతాలను దాటి విస్తరించే పరిస్థితి ఉండబోదని అధికారులు చెబుతున్నారు. కంటైన్మెంట్ ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా బయటికి వెళ్లాలన్నా, లోపలికి రావాలన్నా ఒకటే దారి ఏర్పాటు చేశారు. ఎందుకు బయటికి వెళ్తున్నారో, ఎందుకు లోపలికి వస్తున్నారో నమోదు చేస్తున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల డ్రోన్లతో నిఘా ఉంచారు. పైగా  ఉదయం, సాయంత్రం ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నాయి.

మొన్నటి వరకు వైరస్ ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందో స్ఫష్టంగా తెలియలేదు. కానీ కేసుల సంఖ్య, కాంటాక్టుల వివరాలు తెలుస్తున్నాయి. దీంతోనే కంటైన్మెంట్లను ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటంతో వైరప్ నియంత్రణలోకి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కంటైన్మెంట్ పరిధిలో ఉన్న క్వారంటైన్లలోని బాధితులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కదలికలపై ఆన్ లైన్ నిఘా పెట్టారు. దీంతో వారు ఎక్కడికి వెళ్లినా వెంటనే పోలీసులు అప్రమత్తమై పట్టుకునే వీలు కల్గింది. ఇలా అష్టదిగ్బంధం చేయడంతో వైరస్ వ్యాప్తి గొలుసుకు అడ్డుకట్ట పడినట్లేనని అధికారులు భావిస్తున్నారు.

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఇకపై కేసుల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మర్కజ్ వెళ్లిన వారిని గుర్తించామని, వారి కాంటాక్టులను, వారి ద్వారా ఇంకెవరైనా కాంటాక్టు అయ్యారనేది గుర్తించామని తెలిపారు. అందుకే ఇక నుంచి కరోనా పూర్తి నియంత్రణలోకి వస్తుందన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యే నాటికి కరోనా కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఇక గడిచిన మూడు రోజుల్లో కేసులు భారీగా పెరగడంతో అధికారులు ఒకింత నిరాశకు గురయ్యారు. కేసుల సంఖ్య 650కి చేరువ కావడం, 18 మృతి చెందడంతో పరిస్థితి అదుపు తప్పిందా అనే సందేహం నెలకొంది. మొదట్లో కేసులు విదేశాల నుంచి వచ్చిన వారితోనే రాగా ఆపై నమోదైన ఎక్కువ కేసులు మర్కజ్ కనెక్షన్ తో బయటపడినవే. దీంతోనే పరిస్థితి తీవ్రమైంది.

మొత్తం 28 జిల్లాలకు వైరస్ పాకింది. హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోంది.