వామ్మో.. ఇడ్లీలో పురుగు.. జగిత్యాల జిల్లాలోని మరో హోటల్‌లో దారుణం..

జగిత్యాల జిల్లాలో గత కొన్ని రోజులుగా హోటల్స్ లో ఇలాంటి సంఘటనలు జరిగినా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

వామ్మో.. ఇడ్లీలో పురుగు.. జగిత్యాల జిల్లాలోని మరో హోటల్‌లో దారుణం..

Updated On : October 31, 2024 / 8:23 PM IST

Insect In Idli : జగిత్యాల జిల్లాలోని హోటల్స్ లో పరిశుభ్రత కొరవడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల క్రితం జగిత్యాల పట్టణ కేంద్రంలోని ఓ హోటల్ లో ఇడ్లీలో జెర్రి ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఆ ఘటన మరువక ముందే మరొకటి వెలుగు చూసింది. ఈ వరుస ఘటనలు జగిత్యాల పట్టణ వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

పట్టణంలోని ముత్తు అనే హోటల్ లో టిఫిన్ చేస్తుండగా.. మనోహర్ రెడ్డి అనే వ్యక్తికి ఇడ్లీ తినే సమయంలో పురుగు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీని గురించి హోటల్ యజమానిని నిలదీయగా వారు సరైన సమాధానం చెప్పలేదన్నాడు. పైగా తనతో గొడవకు దిగారని, దూషించారని కస్టమర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

జగిత్యాల జిల్లాలో గత కొన్ని రోజులుగా హోటల్స్ లో ఇలాంటి సంఘటనలు జరిగినా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీన్ని అలుసుగా తీసుకున్న హోటల్ యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం హోటల్స్ కిచెన్ రూమ్ లో పరిశుభ్రత పాటించడం లేదని వారు వాపోతున్నారు.

అంతేకాక కుళ్లిపోయిన, పురుగులు పట్టిన ఆహార నిల్వలు.. పాడైన పదార్ధాలతో తినుబండారాలు చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ ఆహారాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా హోటల్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనం అని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

కొందరు హోటల్ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అస్సలు పరిశుభత్ర పాటించడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పద్దాలు వండి వాటినే కస్టమర్లకు వడ్డిస్తున్నారు. అలాంటి కలుషిత ఆహారం తిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక తినే ఆహారంలో పరుగులు రావడం కామన్ గా మారింది. కిచెన్ శుభ్రంగా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తరుచుగా వస్తున్నాయి. వీటిపై అనేక ఫిర్యాదులు వచ్చినా అధికారుల నుంచి మాత్రం స్పందన లేదని వాపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా మేల్కోవాలని, హోటల్స్ లో తనిఖీలు ముమ్మరం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నిబంధనలు పాటించని హోటల్స్ ను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.