Hyderabad CP CV Anand : హైదరాబాద్ సిటీ కొత్త పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్..

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. అడిషనల్ డీజీ హోదాలో రానున్నారు. నగర పోలీసు కమిషనర్ గా ఉన్న అంజనీ కుమార్ ఏసీబీకి డీజీగా బదిలీ అయ్యారు

Hyderabad CP CV Anand : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. అడిషనల్ డీజీ హోదాలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ, సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ కమీషనర్‌గా సివి ఆనంద్ పనిచేసిన అనుభవం ఉంది. హైదరాబాద్‌లో వివిధ భాగాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్ గా ఉన్న అంజనీ కుమార్ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ)కు డీజీగా బదిలీ అయ్యారు. అంజనీ కుమార్ స్థానంలో సిటీ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎక్సైజ్ డైరెక్టర్, సివిల్ సప్లై కమీషనర్‌గా సివి ఆనంద్‌‌కు 10 ఏళ్ల అనుభవం ఉంది. మావోయిస్టు ఎఫెక్టెడ్ తెలంగాణ జిల్లాలో సీవీ ఆనంద్ పనిచేశారు. 2002లో ప్రెసిడెంట్ గాలంటరీ అవార్డ్ అందుకున్నారు. అలాగే 2018లో కేంద్ర డిపుటేషన్‌పై CISFకు బదిలీ అయ్యారు. కోవిడ్ సమయంలో IG ఎయిర్ పోర్ట్స్ విభాగంలో కీలకంగా వ్యవహరించారు ఆనంద్. క్రికేట్ క్రీడాకారునిగా స్టేట్ లెవల్ పలు కాంపిటీషన్స్‌లో సీవీ ఆనంద్ పాల్గొన్నారు. అండర్-19 విభాగంలో ఇంగ్లాండ్ టూర్‌లో పాల్గొన్నారు. ఆల్ ఇండియా పోలీస్ సింగిల్ చాంపియన్ షిప్ టెన్నీస్‌లో కూడా సీవీ ఆనంద్ విజయం సాధించారు. నేషనల్ పోలీస్ అకాడమీ‌లో బెస్ట్ అథ్లెట్ సీవీ ఆనంద్‌కు మంచి పేరుంది.

మూడేళ్ల క్రితం భారీ సంఖ్యలో బదిలీలు జరిగిన తరువాత మళ్లీ ఈ స్థాయిలో బదిలీలు చేపట్టలేదు. నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులైన సీవీ ఆనంద్ 2018 ఏప్రిల్‌లో కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఆ తర్వాత మూడున్నరేళ్ల క్రితం తెలంగాణ కేడర్‌కు ఆయన బదిలీపై వచ్చారు. మరోవైపు. తెలంగాణలో భారీ ఎత్తున IPS అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 30 మందికి స్థానచలనం జరిగింది. హైదరాబాద్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల బదిలీలు జరిగాయి. సీనియర్ ఐపీఎస్ లు, సిద్దిపేట, నిజమాబాద్ పోలీస్ కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది.

Read Also : Covid-19 : భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నాలుగు వారాలుగా 10 వేలకు పైగా నమోదు

ట్రెండింగ్ వార్తలు