Constable Couple Suicide : కుమార్తె ప్రేమ వివాహం..కానిస్టేబుల్ దంపతుల బలవన్మరణం
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. చెట్టుకు ఉరి వేసుకొని కానిస్టేబుల్ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Daughter Love Marriage Constable Couple Suicide
Daughter love marriage, constable couple suicide : సంగారెడ్డి జిల్లా కంది మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. చెట్టుకు ఉరి వేసుకొని కానిస్టేబుల్ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందనే వారిద్దరూ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
కంది మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ నారాయణ జిన్నారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య రాజేశ్వరి, కుమార్తె ఉన్నారు. అయితే వారం కిందట వారి కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది.
కూతురు ప్రేమ వివాహ చేసుకోవడంతో తమ పరువు పోయిందని నారాయణతో పాటు ఆయన భార్య రాజేశ్వరి కూడా భావిస్తున్నారు. అదే బాధతో ఆ దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.