బేగంపేట చోరీ కేసు.. తల్లీకూతుళ్ల ధైర్యసాహసాలకు జనం జేజేలు

హైదరాబాద్ బేగంపేట రాబరీ కేసులో ధైర్యసాహసాలు చూపించిన మహిళలను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం సన్మానించారు.

బేగంపేట చోరీ కేసు.. తల్లీకూతుళ్ల ధైర్యసాహసాలకు జనం జేజేలు

Updated On : March 22, 2024 / 4:55 PM IST

Begumpet Robbery Case: ఆ తల్లీకూతుళ్ల ధైర్యసాహసాలకు జనం జేజేలు పలుకుతున్నారు. మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న వారి పోరాట స్ఫూర్తి ప్రశంసలందుకుంటోంది. హైదరాబాద్ బేగంపేటలోని పైగా కాలనీలో ఇద్దరు దొంగలను సమర్థవంతంగా ఎదుర్కొని తరిమికొట్టిన తల్లీకూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం సన్మానించారు. దొంగలను పట్టుకోవడానికి పట్టుకోవడానికి అమిత్ మహోత్, ఆమె మైనర్ కుమార్తె చూపించిన తెగువ ప్రశంసనీయమని ఈ సందర్భంగా డీసీపీ రోహిణి అన్నారు.

వారి ధైర్యసాహసాలు గ్రేట్..
”నిన్న మధ్యాహ్నం పైగా కాలనీలో అటెంప్ట్ రాబరీ జరిగింది. నిందితులు మర్డర్ చేయడానికి ప్రయత్నించారు. 2022లో దీపావళి టైంలో వీరి ఇంట్లో పని చేయడానికి వచ్చారు. నాలుగు రోజుల పాటు పని చేశారు. రాబరీ చేయడానికి ఇద్దరు నిందితులు ప్లాన్ చేసుకొని వచ్చారు. రెండు రోజుల ముందు రెక్కీ చేశారు. కొరియర్ వచ్చిందని చెప్పి ఇంట్లోకి వచ్చారు. కంట్రీ మేడ్ వెపన్, కత్తితో బెదిరించారు. నిందితులను పట్టుకోవడానికి తల్లీ కూతుళ్లు ధైర్యసాహసాలు చూపించారు.

నా పదకొండేళ్ల సర్వీస్ లో ఇంత ధైర్యసాహసాలు చూపించిన మహిళలను చూడలేదు. ఒక నిందితుడిని ఇక్కడే పట్టుకున్నారు. మరో నిందితుడిని కాజీపేటలో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. వెపన్ ఎక్కడి నుండి తెచ్చారు.. గతంలో కేసులు ఏమైనా ఉన్నాయా అని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మహిళలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాల”ని డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు.

Also Read: కాళ్లు చేతులు కట్టేసి యువతి కిడ్నాప్.. మళ్లీ ఇదేం ట్విస్టు!