Kumuram Bheem : 10 కిలోమీటర్లు నడిచిన పచ్చి బాలింత..

మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు .. వర్షాలకు కోతకు గురై అధ్వానంగా మారింది. ఈ మార్గంలో ద్విచక్ర వాహనం రావడమే అతికష్టం. దీంతో బాలింత...

Delivery Woman Walked 10 kilometers : అభివృద్ధిలో దూసుకపోతున్నా.. కొన్ని ప్రాంతాలు కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కనీసం మౌలిక సదుపాయాలు ఇప్పటికీ లేకపోవడం గమనార్హం. దీంతో వారు పడుతున్న ఇబ్బందులు వర్ణానీతీతం. గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే.. కాలి నడకన వెళ్లాల్సిందే. రహదారులు లేకపోవడం వల్ల వాహనాలను వచ్చే వీలు కూడా లేదు. గర్భిణీలు, డెలివరీ అయిన మహిళలు డోలీ సహాయంతో ఆసుపత్రులకు చేరుతున్న ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో సమస్యలు మరింత జఠిలంగా మారుతుంటాయి. తాజాగా.. ఓ పచ్చి బాలింత ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది కిలోమీటర్లు నడిచి తన మెట్టినింటికి చేరుకుంది. దీనికి సంబంధించిన ఘటన వైరల్ గా మారింది. దీనికంతటికీ కారణం అధికారుల నిర్లక్ష్యమేనని గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటన ఆసిఫాబాద్ లో చోటు చేసుకుంది.

Read More : Yadagirigutta Parking Charges : గంటకు రూ.500.. యాదగిరిగుట్టపై పార్కింగ్‌ చార్జీల బాదుడు

అధికారుల నిర్లక్ష్యంతో పచ్చి బాలింత ఏకంగా 10 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన నాయకపుగూడ గ్రామంలో చోటు చేసుకుంది. నాగమ్మ- పరమేశ్‌ దంపతులకు .. రెండో సంతానంగా అమ్మాయి జన్మించింది. ప్రసవం కోసం నాగమ్మ నిర్మల్‌ జిల్లాలోని పుట్టింటికి వెళ్లగా.. అయిదురోజుల క్రితం ఆడపిల్ల జన్మించింది. సాధారణ కాన్పు కాకపోవడంతో సిజేరియన్ చేశారు వైద్యులు. అనంతరం ప్రత్యేక వాహనంలో నిర్మల్‌ నుంచి ఆసిఫాబాద్‌ బలాన్‌పూర్‌ వరకు వచ్చారు. ఇక బలాన్‌పూర్‌ నుంచి గోవెన నాయకపుగూడ పది కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో రెండు చిన్నపాటి కొండలు, వాగులు దాటాలి.

Read More : Telangana Covid : తెలంగాణలో కరోనా.. కొత్త కేసులు

అయితే గతేడాది పోలీసులు- మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు .. వర్షాలకు కోతకు గురై అధ్వానంగా మారింది. ఈ మార్గంలో ద్విచక్ర వాహనం రావడమే అతికష్టం. దీంతో బాలింత నాగమ్మ.. దగ్గరి బంధువు సాయంతో పది కిలోమీటర్లు నడిచింది.. మండుటెండలో.. రోజుల బిడ్డను చేతపట్టుకుని.. అడవిదారిలో.. కొండలు.. వాగులు దాటుకుంటూ .. మెట్టింనింటికి చేరింది. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. తమ గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతున్నారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు