Heart Attack: ఆపరేషన్ చేస్తుండగా.. గుండెపోటుతో డాక్టర్ మృతి
హార్ట్ ఎటాక్ తో డాక్టర్ సురేందర్ మృతి చెందినట్టు నిర్మల్ లోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు.
Heart Attack: నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్ సురేందర్ గుండెపోటుతో మృతి చెందారు. నర్సాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్ సురేందర్. తన ప్రైవేటు ఆసుపత్రిలో పేషంట్ కి ఆపరేషన్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. దాంతో డాక్టర్ సురేందర్ మృతి చెందారు. హార్ట్ ఎటాక్ తో డాక్టర్ సురేందర్ మృతి చెందినట్టు నిర్మల్ లోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు.
గుండెపోటు మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. హార్ట్ ఎటాక్ సైలెంట్ కిల్లర్ మారింది. సడెన్ గా గుండెపోటు రావడం, అంతలోనే ప్రాణాలు పోవడం.. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. చిన్న పెద్ద అనే తేడా లేదు.. అందరినీ గుండెపోటు కబళించేస్తోంది. జబ్బులతో బాధ పడుతున్న వారే కాదు.. హెల్తీగా ఉన్న వారిని సైతం హార్ట్ అటాక్ కాటేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. మనం తినే ఆహారం, ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి, కాలుష్యం గుండెపోటుకు దారితీస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.
Also Read: పెళ్లికి ముందు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం స్పెషల్ సర్వీసెస్..
