Doctor
Jagityala: వైద్యం వికటించడం వల్లే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లాలో ఓ రోగి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. అనారోగ్య సమస్యలతో, హెర్నియా ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తికి డాక్టర్ నిర్లక్ష్యంగా వైద్యం చేశారని, దాంతో పేషెంట్ చనిపోయాడని వాపోయారు రోగి బంధువులు.
డిసెంబర్ 3వ తేదీన సతీష్ అనే వ్యక్తి హెర్నియా ఆపరేషన్ చేయించుకునేందుకు జయ నర్సింగ్‌హోమ్‌లో చేరారు. అయితే, బీపీ చెక్ చెయ్యకుండా, ఆక్సిజన్ అందించకుండా మృతుడి ఆపరేషన్ చేయగా.. బందువులకి ఠాగూర్ సినిమా సీన్ చూపించిన వైద్యుడు డాక్టర్ అజయ్ రెడ్డి.
ఆపరేషన్ సమయంలోనే అపస్మారక స్థితిలో వెళ్లి బ్రెయిన్ డెడ్ అవడంతో సతిష్ చనిపోయాడు. అయితే, ఆ సమయంలో చనిపోయిన విషయాన్ని రోగి బంధువులకు కూడా డాక్టర్ చెప్పలేదు. విషయం బంధువులకి చెప్పకుండా వెంటిలేటర్‌పై చికిత్స అవసరం అంటూ శ్రద్ధ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు.
Jagtial Crime : జగిత్యాల జిల్లాలో రైతు సజీవ దహనం
ఈ క్రమంలోనే 6వ తేదీన సాయంత్రం మెరుగైన వైద్యం కోసం కరీం అపోలో హాస్పిటల్‌కు తరలించాలని సూచించారు. ఈ సమయంలోనే సతీష్ చనిపోయినట్లు గుర్తించిన బంధువులు డాక్టర్ ఠాగూర్ సినిమా చూపించారంటూ వాపోయి ఆస్పత్రి ముందే నిరసనకు దిగారు.