Dr Rajaiah Thatikonda : ఇక ఎక్కడా ఆయన పేరు ఎత్తను- మంత్రి కేటీఆర్‌తో భేటీ తర్వాత ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు
Dr Rajaiah Thatikonda : నేను కడియంపై చేసిన విమర్శలు కొత్తవి కావు. గతంలో మోత్కుపల్లి నర్సింహులు, మంద కృష్ణ మాదిగ చేసిన వాటిని ఉటంకించాను.

Dr Rajaiah Thatikonda (Photo : Google)
Dr Rajaiah Thatikonda – Kadiyam Srihari : స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ నాయకుల మధ్య పంచాయితీ ప్రగతిభవన్ కు చేరుకుంది. మంత్రి కేటీఆర్ తో స్టేషన్ గన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కు వివరణ ఇచ్చారు రాజయ్య. కడియంతో రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయన్నారు.
తామిద్దరం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామన్న రాజయ్య.. నేను పార్టీ ఆదేశాలను పాటిస్తున్నా అని చెప్పారు. ఇక, కేటీఆర్ తో భేటీ తర్వాత రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కడియం శ్రీహరి పేరు ఎక్కడా ఎత్తను అని రాజయ్య తేల్చి చెప్పారు.
” నాకు 30ఏళ్ల రాజకీయ నేపథ్యం ఉంది. కడియంతో రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి. ఇద్దరం బీఆర్ఎస్ పార్టీలో కలిశాం. నేను పార్టీ అదేశాలను పాటిస్తున్నా. ఎన్నికలొస్తే నియోజకవర్గంలో ఈ పరిస్థితులు వస్తున్నాయి. మా దగ్గర చోటు చేసుకున్న పరిణామాలు కేటీఆర్ కు వివరించా. నియోజకవర్గంలో పర్యటిస్తూ పోటీ చేస్తానన్న సంకేతాలు ఇవ్వడంతోనే నేను స్పందించాల్సి వచ్చింది. నేను కడియంపై చేసిన విమర్శలు కొత్తవి కావు. గతంలో మోత్కుపల్లి నర్సింహులు, మంద కృష్ణ మాదిగ చేసిన వాటిని ఉటంకించాను. పార్టీ పెద్దల దృష్టికి అన్ని వివరాలు తీసుకెళ్లాలని భావించాను. పార్టీకి సమాచారం అంతా ఉందని కేటీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఇక కడియం పేరు ఎక్కడా తీయను. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను” అని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు.