Online లో Drugs Order చేస్తే… ఇంటి వద్దకే డెలివరీ!

  • Published By: madhu ,Published On : September 23, 2020 / 07:07 AM IST
Online లో Drugs Order చేస్తే… ఇంటి వద్దకే డెలివరీ!

Updated On : September 23, 2020 / 10:22 AM IST

Hyderabad Drugs seized : హైదరాబాద్ లో డ్రగ్స్ అనేక మార్గాల్లో సరఫరా అవుతోందని, ప్రధానంగా ఆన్ లైన్ లో ఆర్డర చేస్తే నేరుగా ఇంటి వద్దకే స్పీడ్ పోస్టు ద్వారా అవి చేరుతున్నాయని ఎక్సైజ్  శాఖ సంచలన విషయాలు వెల్లడించింది. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) సమాచార హక్కు చట్టం ద్వారా వేసిన ప్రశ్నకు ఎక్సైజ్‌శాఖ సమాధానం ఇచ్చింది. ఇందులో అనేక విషయాలు తెలిపింది.



పలువురు విదేశీయులు ఇక్కడ మాదక ద్రవ్యా లు విక్రయిస్తున్నారని అంగీకరించింది. ఈ డ్రగ్స్ గ్రాముల్లో ఉంటుడడంతో గుర్తించడం కష్టతరమౌతోందని అధికారులు తెలిపారు. ఈ దందాలో విద్యార్థులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.



ఇంగ్లండ్, జర్మనీల నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్‌ నేరుగా ఇంటికే చేరుతున్నాయని, స్టీల్‌బౌల్స్‌ పేరుతో కొకైన్, ఎల్‌ఎస్‌డీలను భారత్‌కు దిగుమతి చేస్తున్నారని గుర్తించారు. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని ఓ ఫార్మాలో డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తించారు.
ఇక డ్రగ్స్ కేసుల విచారణలో జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి.



నిందితుల్లో అధికశాతం పేరుమోసిన ప్రముఖులు, పొలిటికల్, సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఉంటుండడంతో విచారణలో ఆలస్యం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. గతంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తొలుత విచారణ స్పీడ్ గా జరిగినా..తర్వాత..ప్రముఖుల పేర్లు లేకపోవడం కేసు పక్కదారి పట్టిస్తున్నారనే టాక్ వినిపించింది.