Duvvada Srinivas And Divvala Madhur
Duvvada Srinivas Divvala Madhur : దువ్వాడ శ్రీనివాస్, మాధురి దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన పార్టీకి వారు హాజరయ్యారు. ఈ క్రమంలో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మద్యం పార్టీ నిర్వహించిన నలుగురిపై, దువ్వాడ శ్రీనివాస్, మాధురిపైనా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Gold and Silver Rates : మరోసారి దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. 2026లో ఇక దబిడిదిబిడే..
మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్‌హౌస్‌లో దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు పార్థసారథి బర్డ్ డే పార్టీ జరిగింది. దీనికి దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు హాజరయ్యారు. అయితే, అనుమతి లేకుండా ఈ పార్టీ నిర్వహిస్తుండటంతో ఎస్వోటీ పోలీసులు దాడుల చేశారు.
పోలీసుల దాడుల్లో ఏడు మద్యం బాటిళ్లు, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీకి 29 మంది హాజరైనట్లు సమాచారం. పార్థసారథితో పాటు ఫామ్‌హౌస్ యాజమాని సుభాష్, వాచ్ మెన్ షేక్, హుక్కా తీసుకొచ్చిన రియాజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చి పంపించేసినట్లు తెలిసింది. వారితోపాటు పార్టీకి హాజరైన దువ్వాడ శ్రీనివాస్, మాధురిపైనా ఎస్వోటీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.