Bhadrachalam Seetharamula Kalyanam : రాములోరి కల్యాణంపై ఈసీ ఆంక్షలు..! భక్తుల్లో తీవ్ర ఆందోళన

రామయ్య కల్యాణ క్రతువు అంతా కూడా అధికారులే చూసుకుంటున్నారు.

Bhadrachalam Seetharamula Kalyanam : రాములోరి కల్యాణంపై ఈసీ ఆంక్షలు..! భక్తుల్లో తీవ్ర ఆందోళన

Bhadrachalam Seetharamula Kalyanam

Bhadrachalam Seetharamula Kalyanam : మరికొన్ని గంటల్లో భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం జరగనుండగా ప్రత్యక్ష ప్రసారంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం తరుపున కల్యాణ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలకు ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. కాగా, కల్యాణ మహోత్సవ లైవ్ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నుంచి మినహాయించాలని ఇప్పటికే తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు.

భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానం ప్రాశస్త్యం, ఆచార సాంప్రదాయాలు, కోట్లాది మంది భక్తుల నమ్మకాలను ఈసీ గౌరవించాలని కోరారు. కల్యాణ మహోత్సవాన్ని 40ఏళ్ల నుంచి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తులు తిలకిస్తున్నారని తన లేఖలో ప్రస్తావించారు కొండా సురేఖ. మరోవైపు ప్రత్యక్ష ప్రసారాల అనుమతిపై ఈసీ నిర్ణయం తీసుకోకపోవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే కల్యాణ మహోత్సవం వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ప్రభుత్వం తరఫున ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఈసీ నిర్ణయంతో సీతారాముల కల్యాణాన్ని తిలకించడానికి భద్రాచలం రాలేని భక్తుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తరుపున ప్రత్యక్ష ప్రసారం కాకుండా మీడియా ప్రసారాలపైనా సందిగ్ధత ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంక్షలు పెట్టింది ఈసీ.

తానిషా కాలం నుండి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చే ఆనవాయితీ ఉంది. ఎన్నికల కోడ్ తో సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి రాలేదు. రామయ్య కల్యాణ క్రతువు అంతా అధికారులు చూసుకుంటున్నారు. పట్టువస్త్రాలు, తలంబ్రాలు కూడా వారే సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

శ్రీరామనవమి సందర్భంగా రేపు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంపై ఉత్కంఠ నెలకొంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం దాదాపు 40 సంవత్సరాల నుంచి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోందని, భక్తుల నమ్మకాన్ని, భద్రాచలం ఆలయ సంప్రదాయాన్ని పరిగణలోకి సీతారాముల కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరింది ప్రభుత్వం.

దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు కల్యాణ మహోత్సవం, ఎల్లుండి పట్టాభిషేకం.. ఈ రెండు కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరుపున దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. దీన్ని వికాస్ రాజ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లేఖను మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష ప్రసారానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.

Also Read : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈనెల 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు