DGP Suspend: రేవంత్ రెడ్డిని కలిసినందుకు డీజీపీ మీద వేటు వేసిన ఎన్నికల సంఘం

వాస్తవానికి శాంతిభద్రతలకు సంబంధించి రాజకీయ నేతలను కలవడం వేరు. అయితే ఈరోజు అంజనీ కుమార్ తీరు ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది

DGP Suspend: రేవంత్ రెడ్డిని కలిసినందుకు డీజీపీ మీద వేటు వేసిన ఎన్నికల సంఘం

Updated On : December 3, 2023 / 5:44 PM IST

ఎన్నికల ఫలితాల విడుదల మధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డిని కలిసిన కాసేపటికే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో (అప్పటికి ఫలితాలు ఇంకా స్పష్టం కాలేదు) రేవంత్ రెడ్డి ఇంటికి అంజనీ కుమార్ వెళ్లారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు వెళ్లారు. అనంతరం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

వాస్తవానికి శాంతిభద్రతలకు సంబంధించి రాజకీయ నేతలను కలవడం వేరు. అయితే ఈరోజు అంజనీ కుమార్ తీరు ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. అయితే సోమవారమే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో తదుపరి డీజీపీ నియామకం తొందరగా జరిగే అవకాశం ఉంది. తదుపరి ర్యాంకుల్లో ఉన్నవారికి నూతన డీజీపీగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.