Electric Bike Battery : ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి

అర్ధరాత్రి వేళ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి చార్జింగ్ పెట్టిన సమయంలో మంటలు చెలరేగి బ్యాటరీ పేలి పోయింది. బ్యాటరీ తీసి సపరేట్ గా చార్జింగ్ పెట్టడంతో పెద్ద శబ్ధంతో పేలింది.

Electric Bike Battery : ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి

Explode

Updated On : April 20, 2022 / 3:54 PM IST

Electric bike battery explodes : నిజామాబాద్ లో విషాదం నెలకొంది. సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటినా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అర్ధరాత్రి వేళ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి చార్జింగ్ పెట్టిన సమయంలో మంటలు చెలరేగి బ్యాటరీ పేలి పోయినట్లుగా తెలుస్తోంది. బ్యాటరీ తీసి సపరేట్ గా చార్జింగ్ పెట్టడంతో పెద్ద శబ్ధంతో పేలింది. దీంతో అక్కడే నిద్రిస్తున్న నలుగురిలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Electric Bike Explodes : బాంబులా పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తండ్రి, కూతురు మృతి

సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.