దిశ నిందితుల ఎన్ కౌంటర్ :దుర్మార్గులకు ఇదో హెచ్చరిక : మంత్రి గంగుల

దిశ నిందితుల ఎన్ కౌంటర్ చేయటం దుర్మార్గులకు ఇదో హెచ్చరిక అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇది తెలంగాణ పోలీస్ సత్తా అని కొనియాడారు. అడబిడ్డలపై ఇటువంటి అరాచకాలు జరగకుండా ఇదొక హెచ్చరిక అని అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలపై పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారనీ..సంఘ వ్యతిరేక శక్తులకు రాష్ట్రంలో చోటులేదని చెప్పటానికి దిశ ఎన్ కౌంటర్ నిదర్శనమని తెలంగాణ పోలీసులు మరోసారి రుజువు చేశారనీ అన్నారు. దిశ ఘటన విషయంలో నిందితుల్ని శిక్షి విధించటానికి ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదనీ..ఏకంగా పోలీసులపైనే నిందితులు దాడికి పాల్పడినందు వల్ల వారిని ఎన్ కౌంటర్ చేశారని మంత్రి గంగులు కమాలాకర్ స్పష్టం చేశారు.