Jupally : బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు, త్వరలోనే నిర్ణయం తీసుకుంటా- జూపల్లి కీలక వ్యాఖ్యలు

కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు(Jupally) త్వరలోనే ఆ పార్టీ వీడి ఓ జాతీయ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.

Jupally : బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు, త్వరలోనే నిర్ణయం తీసుకుంటా- జూపల్లి కీలక వ్యాఖ్యలు

Jupally

Updated On : March 11, 2022 / 5:46 PM IST

Jupally : కొల్లాపూర్ టీఆర్ఎస్ లో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య వర్గపోరు మరోసారి భగ్గుమంది. జూపల్లి కృష్ణారావు కొన్ని రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇప్పుడు మరోసారి కొల్లాపూర్ నియోజకవర్గంలో తన అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కొల్లాపూర్ రాజకీయం మరింత వేడెక్కింది. నియోజకవర్గ ప్రజలతో 30 ఏళ్ల అనుబంధం ఉందని, త్వరలో ఏ నిర్ణయం తీసుకున్నా.. కార్యకర్తలకు మంచి జరుగుతుందని జూపల్లి అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారాయన. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరానని జూపల్లి చెప్పారు.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 30 సంవత్సరాల నుంచి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో అనుబంధం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరినట్టు గుర్తు చేశారు.(Jupally)

ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. త్వరలో నిర్ణయం తీసుకుంటాను అని కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు నా భవిష్యత్తు ముఖ్యం కాదన్న ఆయన.. నన్ను నమ్ముకున్న కొల్లాపూర్ ప్రజల భవిష్యత్ ముఖ్యం అని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, రానున్న రోజుల్లో మనకు మంచి జరుగుతుందని జూపల్లి అన్నారు. జూపల్లి అంటే సేవాభావంతో కూడిన రాజకీయం చేస్తాడని చెప్పారు. కొంతమంది బెదిరింపు రాజకీయం చేస్తున్నారని, ఎవరూ భయపడొద్దని కార్యకర్తలతో అన్నారు.

Ponguleti TRS : కాంగ్రెస్, బీజేపీ వాళ్లు టచ్‌లో ఉన్నారు – పొంగులేటి

మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆయన ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలతో చర్చించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన జూపల్లి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ లో మంత్రిగా పనిచేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు… కాంగ్రెస్ అభ్యర్ధి హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య పోరు సాగుతోంది. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు తన అభ్యర్ధులను గెలిపించుకున్నారు. ఈ పరిణామాలపై టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ అయింది.

ఇటీవలే ఖమ్మంలో టీఆర్ఎస్ లో అసమ్మతి వర్గంగా ఉన్న నేతలతో జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలోని తన అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు త్వరలోనే ఆ పార్టీ వీడి ఓ జాతీయ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. జూపల్లి కృష్ణారావు బీజేపీ వైపు చూస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇదే విషయాన్ని తన అనుచరులకు జూపల్లి కృష్ణారావు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. కాగా, తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల కోసమేనని… తన పదవి కోసం ఏనాడు పని చేయలేదని జూపల్లి వెల్లడించారు.

TS BJP : ‘దేశంలో పీపుల్స్ ఫ్రంటూ లేదు ఏ టెంటూ లేదు’..ఇంజన్ లేని సర్కార్ ఉన్నా..లేకున్నా ఒక్కటే : బండి సెటైర్లు

తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల కోసమే అని, తన పదవుల కోసం కాదని జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతేకాదు వచ్చే 9 నెలల్లో ఏం జరుగుతుందో చూద్దామని జూపల్లి అనడం హాట్ టాపిక్ గా మారింది.