TS BJP : ‘దేశంలో పీపుల్స్ ఫ్రంటూ లేదు ఏ టెంటూ లేదు’..ఇంజన్ లేని సర్కార్ ఉన్నా..లేకున్నా ఒక్కటే : బండి సెటైర్లు

‘దేశంలో పీపుల్స్ ఫ్రంటూ లేదు ఏ టెంటూ లేదు’..డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా లేకున్నా ఒక్కటే అంటూ బండి సెటైర్లు వేశారు.

TS BJP : ‘దేశంలో పీపుల్స్ ఫ్రంటూ లేదు ఏ టెంటూ లేదు’..ఇంజన్ లేని సర్కార్ ఉన్నా..లేకున్నా ఒక్కటే : బండి సెటైర్లు

No People's Fund In India Said Bandi Sanjay

No People’s Fund in India Said Bandi Sanjay : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలల్లో అత్యధికంగా బీజేపీ హవా కొనసాగించటంతో సాధించటంతో దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలతో పాటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ..‘‘దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది అనీ.. దేశంలో పీపుల్స్ ఫ్రంటూ లేదు ఏ టెంటూ లేదు’ అంటూ పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఎద్దేవా చేశారు బండి సంజయ్. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చి తీరుతుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీపై మరోసారి సెటైర్లు విసిరారు బండి. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక తరువాత రాష్ట్రంలో బీజేపీ పుంజుకుందని అన్నారు.

Also read : Punjab : పంజాబ్‌కా షాన్‌.. పంజాబ్‌కా షేర్.. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం

బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది. సీట్లు కూడా పెరిగాయని అన్న బండి తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని..ఇంజన్ లేని సర్కార్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీపై సెటైర్లు విసిరారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని అన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. అలాగే ఇటీవల ట్రిపుల్ ఫ్రంట్..అంటే పీపుల్స్ ఫ్రంట్ అంటూ పలు రాష్ట్రాలు తిరిగిన కేసీఆర్ వ్యూహాలపై కూడా బండి సంజయ్ సెటైర్లు వేశారు.

Also read : Five State Elections : త్వరలో రాష్ట్ర పార్టీలో కొత్త కమిటీ – కోమటి రెడ్డి

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీలో అధికారంలోకి రావటం ఖాయం అన్నారు. ఈ ఫలితాలు ముందుగా ఊహించినదేనన్నారు. కొన్ని సర్వే సంస్థలు, మీడియా ప్రతినిధులు యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ పనైపోతుందని ప్రచారం చేశారని అన్నారు. అయితే ఆ నాలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వాస్తవిక పరిస్థితులకు అద్దెంపట్టేలా సరైన సమాచారాన్ని అందించినట్లు అభినందనలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కావాలని అక్కడి ప్రజలు ఆశించారని పేర్కొన్నారు.

Also read : Punjab Election Review: పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచిన “త్రిమూర్తులు”

తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టిందని బండి సంజయ్ అన్నారు. అందుకే రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ బద్నాం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. పీపుల్స ఫ్రంట్ ..ఆ ఫ్రంటూ ఈ ఫ్రంటూ అంటూ కేసీఆర్ చేసినవి..చేస్తున్న పర్యటనలు కేవలం విహార యాత్రలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పర్యటనలతో ఒరిగేదేమీ ఉండదన్నారు.