Experium Eco Friendly Park : ఎక్స్ పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ మహా అద్భుతం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇందులో చాలా మొక్కలు ఉన్నాయని చెప్పారాయన. పార్క్ ను అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. సినిమా షూటింగ్ లకు ఇది సరైన ప్లేస్ అన్నారు చిరంజీవి. కళలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని అభినందించారు చిరంజీవి.
Also Read : మహిళా సంఘాలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మీ డబ్బులు వాపస్ ఇస్తున్న ప్రభుత్వం
విలువైన భూమి ఉంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారు..
”విలువైన భూమి ఉంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారు. కానీ, రాందేవ్ అలాంటి వ్యక్తి కాదు. ఎక్స్‌పీరియం పార్క్ ను ఏర్పాటు చేశారాయన. హైదరాబాద్ నగరానికి విలువైన మొక్కలు తీసుకొచ్చారు. ఆయన ప్యాషన్ ను అభినందించాల్సిందే. నిజంగా చాలా గ్రేట్ పర్సన్. హైదరాబాద్‌కు ఇలాంటి మొక్కలను తీసుకురావడం అభినందనీయం. రాందేవ్.. బిజినెస్ మ్యాన్ లా కాకుండా కళాకారుడిలా కనిపించారు” అని ప్రశంసల వర్షం కురిపించారు మెగాస్టార్ చిరంజీవి.
పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచించే గొప్ప మనిషి..
”రాందేవ్‌తో నా పరిచయం ఇప్పటిది కాదు. 2000 వ సంవత్సరంలోనే ఈ పార్క్ గురించి రాందేవ్ నాతో పంచుకున్నారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ దగ్గర నుంచి మొక్కలను తెప్పించుకుంటూనే ఉన్నా. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. రాందేవ్ ఓ వ్యాపారవేత్తగా ఎప్పుడూ ఆలోచించరు. పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచించే గొప్ప మనిషి. నిజానికి.. ఈ 150 ఎకరాలను కమర్షియల్ వాడుకోవచ్చు. కానీ రాందేవ్ అలాంటి వ్యక్తి కాదు. అనేక దేశాల నుంచి కొత్త జాతి మొక్కలను తీసుకొచ్చి ఈ పార్క్ ని నిర్మించారు” అని చిరంజీవి అన్నారు.
Also Read : జగిత్యాల జిల్లాలో భూ కుంభకోణం..! ఎరక్కపోయి ఇరుక్కుపోయిందెవరు? చివరికి బుక్కయ్యేదెవరు?
”వ్యాపార దృక్పథం కాదు. కళా హృదయం ఉండాలి. రాందేవ్ కు అంత తపన, ఇష్టం లేకపోతే సుదీర్ఘ కాలం పాలు 25ఏళ్ల పాటు దీనిపై ఎక్స్ పరిమెంట్, అనేక రీసెర్చ్ లు చేస్తూ ఎక్కడెక్కడ ఏయే మొక్కలు దొరుకుతాయి, శిలాకృతులు దొరుకుతాయి, వాటిని ఇక్కడికి ఎలా తీసుకురావాలి అని తెలుసుకున్నారు. ఇది అసాధ్యం అనుకోకుండా సాధ్యమే అని నమ్మారు.
ఇది హైదరాబాద్ కి, మన రాష్ట్రానికి అందం తీసుకొచ్చేది అవుతుంది, మన దేశంలోనే చెప్పుకోదగ్గ గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, శ్రమ ఈరోజున అద్భుత కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే నభూతో నభవిష్యత్.
ఎవరైనా సరే అంత డబ్బు ఉంటే ఏ వ్యాపారం చేద్దాం అని ఆలోచిస్తారు. ఇంత స్థలం ఉంటే దీన్ని రియల్ ఎస్టేట్ చేద్దాం అని చూస్తారు. ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని మల్టీస్టోరీని కట్టుకుంటే తరతరాలుగా నిలిచిపోతారు. అలా కాకుండా ప్యాషన్ తో వెళ్లారు. ఈ పార్క్ రాందేవ్ మదిలోని బ్రెయిన్ చైల్డ్. దానికి ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే గ్రేట్” అని ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి.
ఈ చోటును షూటింగ్‌కు ఇస్తారా అని రాందేవ్‌ను అడిగా..
”మహా అద్భుతంగా ఉన్న ఈ పార్క్ ని చూసి నేను మైమరిచిపోయా. షూటింగ్‌కు ఇస్తారా అని రాందేవ్‌ను అడిగా. ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే అయితే ఇస్తామని ఆయన అన్నారు. వానా కాలం తర్వాత ఇక్కడ మరింత పచ్చదనం వస్తుంది. ఆ సమయంలో షూటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. వివాహాలకు, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలకు ఈ చోటు అనువుగా ఉంటుంది” అని చిరంజీవి అన్నారు.
25 వేల జాతుల మొక్కలు, 85 దేశాల నుంచి దిగుమతి..
రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో 150 ఎకరాల్లో రాందేవ్ రావ్ ఈ పార్క్ ను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్క్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ పార్క్ లో 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల జాతుల మొక్కలున్నాయి. రు. లక్ష రూపాయల నుంచి 3.5 కోట్ల రూపాయల విలువ చేసే అరుదైన వృక్షాలు ఈ పార్క్ లో ఉన్నాయి. ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఎక్స్‌పీరియంను తీర్చిదిద్దారు రాందేవ్ రావ్.