10టీవీ ఫుడ్‌ ఫ్యూజన్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం: 10టీవీపై మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసల జల్లు

"ఒక రకంగా చెప్పాలంటే మా శాఖ నిర్వహించే కార్యక్రమాన్ని మీ భుజాలపైకి ఎత్తుకొని నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను" అని అన్నారు.

10టీవీ ఫుడ్‌ ఫ్యూజన్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం: 10టీవీపై మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసల జల్లు

Updated On : June 7, 2025 / 8:40 PM IST

టాప్ మోస్ట్ రెస్టారెంట్స్‌, హోటళ్లు అందిస్తున్న సర్వీసులకుగానూ 10టీవీ ఫుడ్‌ ఫ్యూజన్‌ అవార్డ్స్‌ 2025 ప్రదానోత్సవం జరిగింది. మంచి ఫుడ్‌ అందించే అవుట్‌లెట్స్‌ ఈ అవార్డులు అందుకున్నాయి.

ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్బంగా మాట్లాడుతూ… 10 టీవీపై ప్రశంసల జల్లు కురిపించారు. 10 టీవీ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిందని చెప్పారు.

“ఒక రకంగా చెప్పాలంటే మా శాఖ నిర్వహించే కార్యక్రమాన్ని మీ భుజాలపైకి ఎత్తుకొని నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. హైదరాబాద్ అంటేనే కాస్మోపాలిటన్‌ సిటీ. వివిధ మతాలు, కులాలు, భాషల వారు ఉన్నారు. అందులో ఈ వంటకాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.

చాలాకాలం నుంచి హైదరాబాద్ అంటేనే బిర్యానీ.. నిజామీ బిర్యానీ.. ఇరానీ ఛాయ్‌కి ఫేమస్. రకరకాల వంటకాలు. దీంతో పాటుగా తెలంగాణ వంటకాలు.. తెలుగు వంటకాలు.. రకరకాల రుచులను మనం ఆస్వాదిస్తాం.

ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన, అందరికీ సంబంధించిన ఫుడ్ కూడా మన దగ్గర దొరుకుతోంది. దీంతో ఇప్పుడు టూరిజం కూడా పెద్ద ఎత్తున డెవలప్ అవుతోంది. అంటే ఇండైరెక్ట్ గా మా శాఖ ద్వారా మీ బిజినెస్‌ను కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం.

ఒక రకంగా ఇండైరెక్ట్‌గా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వంటకాల్ని, తెలంగాణ రుచుల్ని ప్రపంచానికి మొత్తానికి పరిచయం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని కూడా తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది. 10టీవీ సంస్థ గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు అభినందిస్తున్నాను. సో ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్..” అని అన్నారు.