Harish Rao Comments : నువ్వు టచ్ చేయాల్సింది రైతులను.. 6 గ్యారంటీలను.. మమ్మల్ని కాదు : హరీష్ రావు ఫైర్

అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హమీలు ఎక్కడా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాల్సిందిగా సీఎం రేవంత్‌ను హరీష్ రావు డిమాండ్ చేశారు.

Harish Rao Comments : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాయకోరుకుడు మాటలు తప్ప ఏమి లేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెదక్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నువ్వు టచ్ చేయాలిసినది రైతులను. ఆరు గ్యారంటీలను.. మా నాయకులను కార్యకర్తలను కాదు.. ముందుగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Read Also : Komati Reddy Venkat Reddy : భువనగిరి అంటే.. కాంగ్రెస్ కంచుకోటగా మళ్లీ నిరూపించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నువ్వు నామినేషన్ చేసిన కలెక్టర్ కార్యాలయం కట్టింది ఎవరని సీఎం రేవంత్‌ను హరీష్ రావు ప్రశ్నించారు. జిల్లా కాబట్టే మెదక్‌లో నామినేషన్ వేశావు.. లేకుంటే సంగారెడ్డిలో వేసేవాడివని విమర్శించారు. కేసీఆర్ ఏమి చేసినారని మాట్లాడుతున్నారు.. జిల్లాలో కలెక్టర్ కార్యాలయం, రామదాసు చౌరస్తా కనిపించలేదా? అని పేర్కొన్నారు.

ఏడుపాయలకు వంద కోట్ల రూపాయలు కేసీఆర్ ఇస్తే.. నువ్వు రద్దు చేసినవు.. అమ్మవారి ఉసురుమడుతుందని చెప్పారు. బీహెచ్ఈఎల్ ఇందిరాగాంధి రాక ముందు వచ్చిందని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటాలా? అంటూ దుయ్యబట్టారు.

60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలి :
అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హమీలు ఎక్కడా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాల్సిందిగా సీఎం రేవంత్‌ను హరీష్ రావు డిమాండ్ చేశారు. వెంకట్రామి రెడ్డి పటాన్ చేరులో ఓటు వేయడమే కాదు.. 20 ఏళ్లు సేవ చేసినాడని అన్నారు. రేవంత్ రెడ్డిని ఎంపీ ఎన్నికలలో ఓడగొట్టి అహంకారం దించాలన్నారు. గాలిలో తేలియాడుతున్న కాంగ్రెస్ పార్టీని కిందికి దించాలని చెప్పారు.

తోనిగండ్లలో రైతులు 18 రోజులు నుంచి రైతులు తిప్పలు పడుతున్నారని, ఒక రైతును పరామర్శించినావా.. ప్రజాపాలన ఎటుపోయిందంటూ రేవంత్‌ను ప్రశ్నించారు. విజ్ఞులైన మెదక్ ప్రజలు పార్లమెంటు అభ్యర్థిని గెలిపిస్తారని అన్నారు. వడ్ల కోనుగోలు కేంద్రాలను పరీశీలన చేయాలి గానీ, హరీష్ రావును తిడితే కాదన్నారు. అసెంబ్లీలో నిరుద్యోగ భ్రుతి ఇస్తామని ఎన్నికలలో చెప్పలేమని అంటున్నారని హరీష్ రావు విమర్శించారు.

Read Also : CM Revanth Reddy : నాతో పాటు ముఖ్యమంత్రిగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు