Etela Rajender Illness : మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అస్వస్థత

మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స కోసం ఈటలను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.

Etela Rajender Illness : మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అస్వస్థత

Former Minister Itala Rajender Is Illness

Updated On : July 30, 2021 / 6:31 PM IST

Itala Rajender is Illness : మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినట్లు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స కోసం ఈటలను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. కాళ్ల నొప్పులతోపాటు తీవ్ర జ్వరంతో ఈటల బాధపడుతున్నారు. వీణవంక మండలం కొండపాక వరకు పాదయాత్ర చేసి నిలిపివేశారు.

ఈటల రాజేందర్ పాదయాత్ర 12 వ రోజు కొనసాగింది. ఇప్పటివరకు 221 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. రోజుకు దాదాపు 15 కిలో మీటర్లు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో చాలా మందిని కలుస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ పాదయాత్ర కొనసాగించడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అయన సన్నిహతులు, బీజేపీ శ్రేణులు వైద్యులకు సమాచారం అందించడంతో వారంతా కొండపాక వద్దకు చేరుకుని బస్సులోనే వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఆరోగ్య పరిస్థితి తీవ్రతరం కాకముందే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించి వైద్యం అందించాలని సూచించడంతో ఆయన్ను నిమ్స్ కు తరలించారు. ఈటలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈటల రాజేందర్ ఇటీవలే టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు.