KTR
KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు గుప్పించారు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా అంటూ కేటీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు.. రాష్ట్ర సంపద పెంచడమని తెలుసుకోవాలి అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. స్టేచర్ లేకున్నా.. పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయి అంటూ ఫైర్ అయ్యారు.
Also Read: Raja Singh: పాత సామాను బయటకు పోతేనే..! సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ సెన్సేషనల్ కామెంట్స్
కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. ‘‘బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి.. నంగనాచి మాటలా..? ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు, గ్యారంటీల అమలుకు, ఉద్యోగుల జీతాలకు, రిటైర్ అయినవారికి పెన్షన్లకు పైసలు లేవా ?! అసమర్ధుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలం అయింది. ప్రభుత్వాన్ని నడపలేని వ్యక్తికి ఎందుకంత అహంకారం? అంటూ కేటీఆర్ విమర్శించారు.
Also Read: Gudivada Amarnath: విజయసాయి రెడ్డి కోటరీ వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అమర్నాథ్ సంచలన కామెంట్స్
ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు.. రాష్ట్ర సంపద పెంచడం. లేనిది ఆదాయం కాదు. నీ మెదడలో విషయం. స్టేచర్ లేకున్నా, పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయి. పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థికరంగాన్ని చిందరవందర చేశావు. తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నావు అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. ఒకటో నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి.. ఆశా, అంగన్ వాడీలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా..? ప్రజలకు గ్యారెంటీలే కాదు.. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు చేతకానితనానికి నిదర్శనం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఉద్యోగులు సహకరించడం లేదనడం వారిని దారుణంగా అవమానించడమే, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. పరిపాలన రాక పెంటకుప్ప చేసి ఉద్యోగాలు పనిచేస్తలేరని నిందలేస్తే సహించం అంటూ కేటీఆర్ హెచ్చరించారు.