Gudivada Amarnath: విజయసాయి రెడ్డి కోటరీ వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అమర్నాథ్ సంచలన కామెంట్స్

మజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు.

Gudivada Amarnath: విజయసాయి రెడ్డి కోటరీ వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అమర్నాథ్ సంచలన కామెంట్స్

Vijaya Sai Reddy and Gudivada Amarnath

Updated On : March 13, 2025 / 11:32 AM IST

Gudivada Amarnath: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి కోటరీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన వ్యాఖ్యల తర్వాత వ్యవసాయం కాదు.. రాజకీయం చేస్తారనేది అర్థం అయింది అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: VijayaSai Reddy : అందుకే వైఎస్ జగన్‌కు దూరం అయ్యాను.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

జగన్ మోహన్ రెడ్డి కోటరీ అంటే వైసీపీ కార్యకర్తలు మాత్రమే. ఏ రాజకీయ పార్టీలో కోటరీ ఉండదో చెప్పాలి. అది ప్రతీ వ్యవస్థలో భాగం. మొన్నటి వరకు కోటరీలో ఉన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత ఇంత కంటే గొప్పగా మాట్లాడతారని భావించలేం. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. రాజీనామా తరువాత ఇక ఏ రాజకీయ పార్టీలో చేరనని చెప్పి మాటలకు.. నిన్నటి ఆయన వ్యాఖ్యలకు తేడా కనిపించింది. 2024లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యివుంటే పార్టీ నుంచి వెళ్లిపోయేవారా..? ఇదేవిధంగా మాట్లాడేవారా.? అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు.

Also Read: Kakani Govardhan Reddy : చంద్రబాబే ఇలా మాట్లాడించి ఉంటారు- విజయసాయిరెడ్డి ఆరోపణలపై మాజీమంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు..

కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. ప్రతీ మంగళవారం అప్పులు చెయ్యడం కోసం బటన్ నొక్కుతున్నారు తప్ప ప్రజలకు మేలు చేసేందుకు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేతులు రావడం లేదని అన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా మా ప్రభుత్వం హయాంలో విద్యాదీవెన ఒక క్వార్టర్ మాత్రమే పెండింగ్ ఉంది. ప్రస్తుతం 4,500కోట్లు తక్షణం విడుదల చెయ్యాలని తల్లిదండ్రులు, విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.