Kalvakuntla Vidyasagar Rao
Kalvakuntla Vidyasagar Rao ill : జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వెంటనే డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యుల అనుమతితో గుండెకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
కాగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కాలు జారి పడి యశోద ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కాలి ఎముక విరిగిందని డాక్టర్లు చెబుతున్నారు.
ఫాంహౌజ్లో జారిపడ్డ కేసీఆర్.. కాలి ఎముక విరిగిందన్న వైద్యులు