Formula E Car Race Case : ఈ ఫార్ములా కార్ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ ఫార్ములా కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలని కోరుతూ ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ రాశారు. ఈ లేఖకు గవర్నర్ అనుమతి ఇచ్చిన కాపీని జత చేశారు. సీఎస్ శాంతికుమారి లేఖతో ఏసీబీ రంగంలోకి దిగింది.
ఈ కేసులో విచారణ ప్రారంభించింది. నిందితులకు నోటీసులు జారీ చేయనుంది. అనంతరం నోటీసులకు నిందితులు ఇచ్చే సమాధానంపై ఏసీబీ ముందుకెళ్లనుంది. ఒకవేళ నిందితుల నుంచి సరైన సమాధానం రాకపోతే అరెస్ట్ చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై వివరాలను తీసుకుంది ఏసీబీ.
ఈ ఫార్ములా కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. కచ్చితంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాల్సిందిగా కోరుతూ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి.. ఏసీబీకి లేఖ రాశారు. రూ.50 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వంలో అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇన్వాల్వ్ మెంట్ ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన అరవింద్ కుమార్ పైనా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది.
సెక్షన్ 17 ప్రకారం కచ్చితంగా గవర్నర్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి దీనిపై సమగ్ర దర్యాఫ్తు జరిపించాలని ఏసీబీ అధికారులను కోరారు. ఏసీబీ అధికారులు దీనిపై కేసు నమోదు చేసిన తర్వాత నిందితులకు మొదటగా నోటీసులు జారీ చేస్తారు. వారి నుంచి వివరాలు సేకరిస్తారు. ఆ వివరాలతో సంతృప్తి చెందకపోతే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంటుంది.
ఈ ఫార్ములా కేసులో మొదటి నుంచి మాజీ మంత్రి కేటీఆర్ పేరు, అరవింద్ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ లో చేర్చి తర్వాత మొదటగా నోటీసులు జారీ చేస్తారు. బీఎన్ఎస్ యాక్ట్ 35 ప్లస్ వన్ ప్రకారం మొదటగా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరిస్తారు. విచారణకు హాజరు కావాలని పిలుస్తారు. వారిచ్చే వివరాలతో సంతృప్తి చెందకపోతే ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారించే ఛాన్స్ ఉంది.
Also Read : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత సాహసం చేస్తారా?