Hyderabad Police : రాత్రి వేళ మ‌హిళ‌ల‌కు ‘పోలీసుల ఉచిత ప్ర‌యాణ ప‌థ‌కం’.. స్ప‌ష్ట‌త నిచ్చిన హైద‌రాబాద్ పోలీసులు

రాత్రి స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు ఉచిత ర‌వాణా సౌక‌ర్యం అంటూ సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Free Transport for womens in night time Hyderabad police give clarity

Hyderabad Police : రాత్రి స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు ఉచిత ర‌వాణా సౌక‌ర్యం అంటూ సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీనిపై హైద‌రాబాద్ పోలీసులు స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేద‌న్నారు.

‘ఇటీవ‌ల మ‌హిళ‌ల పై ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య‌ ఒంట‌రిగా ఉన్న మ‌హిళ ఇంటికి వెళ్లేందుకు వాహ‌నం దొర‌క‌ని ప‌క్షంలో పోలీసు హెల్ప్‌లైన్ నంబ‌ర్‌ల‌ను (1091, 78370 18555 ) సంప్ర‌దించి వాహ‌నం కోసం అభ్య‌ర్థించ‌వ‌చ్చు. పోలీసులు ఉచిత ప్ర‌యాణ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. వారు 24 గంట‌లు ప‌నిచేస్తారు. కంట్రోల్ రూమ్ వాహ‌నం లేదా స‌మీపంలోని పీసీఆర్ వాహ‌నం లేదా ఎస్‌హెచ్ఓ వాహ‌నం ఆమెను సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానానికి తీసుకువెళ్తాయి. ఇది ఉచితంగా చేయ‌బ‌డుతోంది. మీకు తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి.

మీ భార్య‌, కుమార్తెలు, సోద‌రీమ‌ణులు, త‌ల్లులు మ‌రియు మీకు తెలిసిన మ‌హిళ‌లంద‌రికి షేర్ చేయండి. దీన్ని సేవ్ చేయ‌మ‌ని వారికి చెప్పండి.’ అంటూ ఓ మెసేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అందుకే మావోయిస్టులు మా అక్కను చంపారు: బంటి రాధ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

దీనిపై హైద‌రాబాద్ పోలీసులు ఎక్స్‌లో స్పందించారు. ఈ సందేశాన్ని తాము చూశామ‌న్నారు. ఇందులో ఎలాంటి నిజం లేద‌న్నారు. ఆ మెసేజ్‌తో తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇలాంటి సందేశాల‌ను పంపే ముందు ఓ సారి ఖ‌చ్చితంగా వాస్త‌వాల‌ను ధృవీక‌రించుకోవాల‌న్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల అనవసరమైన భయాందోళనలు గందరగోళం ఏర్పడవచ్చున‌ని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు