Gachibowli Drugs Case : గోవా నుంచి హైద‌రాబాద్‌కు.. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

బేగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు రెండు దఫాల్లో నిందితులు అతనికి 30వేలు గూగుల్ పే ద్వారా చెల్లించినట్లు పోలీసులు తెలిపారు.

Gachibowli Drugs Case Updates: గచ్చిబౌలి డ్రగ్స్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. గోవాలో డ్రగ్స్ వ్యాపారి అబ్దుల్ నుంచి మత్తుపదార్థాలు సరఫరా జరిగినట్లు నిర్ధారించారు. అబ్దుల్ నుంచి రెహమాన్, మీర్జా, అబ్బాస్, ప్రవీణ్, వివేకానంద్ కు డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అబ్దుల్ ప్రస్తుతం గోవా జైలులో ఉన్నాడు. ఈ కేసులో ప్రధాన డ్రగ్స్ సరఫరా దారుడుగా ఉన్న మీర్జావహీద్ బేగ్ స్నాప్ చాట్ లో చాటింగ్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Also Read : Radisson Blu drugs case : పోలీసుల విచారణలో క్రిష్ ఏమి చెప్పాడు? పాజిటివ్ తేలితే అరెస్ట్ చేసే అవకాశం

గత నెల 29న బేగ్ ను అరెస్ట్ చేసి అతని వద్ద 3.58 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరిలో పదిసార్లు బేగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఇందులో క్రిస్ పేరును మరోమారు ప్రస్తావించారు. బేగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు రెండు దఫాల్లో నిందితులు అతనికి 30వేలు గూగుల్ పే ద్వారా చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 24న జరిగిన పార్టీలో 10మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు లిషిత, నీల్, సందీప్, శ్వేతా పరారీలో ఉన్నారు. నీల్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పురోగతి సాధించేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Also Read : Drugs : అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ విక్రయం.. హైదరాబాద్‌లో కలకలం, విద్యార్థి అరెస్ట్

 

 

ట్రెండింగ్ వార్తలు