Radisson Blu drugs case : పోలీసుల విచారణలో క్రిష్ ఏమి చెప్పాడు? పాజిటివ్ తేలితే అరెస్ట్ చేసే అవకాశం

క్రిష్ సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా శుక్రవారమే హాజరయ్యారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన నిందితులు

Radisson Blu drugs case : పోలీసుల విచారణలో క్రిష్ ఏమి చెప్పాడు? పాజిటివ్ తేలితే అరెస్ట్ చేసే అవకాశం

Director Krish Jagarlamudi

Krish Jagarlamudi : హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ శుక్రవారం రాత్రి గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో క్రిష్ ఏ10గా ఉన్నారు. సుమారు నాలుగు గంటలపాటు క్రిష్ ను పోలీసులు విచారించారు. క్రిష్ నుంచి డ్రగ్స్ టెస్ట్ కోసం శాంపిల్స్ స్వీకరించారు. క్రిస్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను పోలీసులు ల్యాబ్ కు పంపించారు. టెస్టులో పాజిటివ్ తేలితే పోలీసులు క్రిష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. టెస్టుల్లో నెగిటివ్ అని తేలితే సాక్ష్యంకోసం మరోసారి విచారణకు పిలిచే చాన్స్ ఉంది. అయితే, క్రిష్ విచారణలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. పోలీసుల విచారణలో క్రిష్ ఏమి చెప్పాడన్న విషయం సస్పెన్ష్ గా మారింది.

Also Read : Krish Jagarlamudi : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు.. ముందస్తు బెయిల్ కోసం దర్శకుడు క్రిష్..

క్రిష్ సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా శుక్రవారమే హాజరయ్యారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన నిందితులు గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్ నాథ్ నమూనాలు పాజిటివ్ గా వచ్చినట్లు తెలుస్తుండటం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. ఈ కేసులో 14 మందికి ప్రమేయం ఉందని పోలీసులు జరిపిన దర్యాప్తులో తేలింది. వీరిలో లిషి, సందీప్, శ్వేత, నీల్ పోలీసుల ముందుకు రాలేదు. శ్వేత గోవాలో, సందీప్ కర్ణాటకలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. లిషి జాడ మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. వీరు డ్రగ్స్ వినియోగించకుంటే పోలీసుల ఎదుటకు ఎందుకు రావడానికి వెనకాడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఆలస్యం చేసే కొద్దీ మూత్రం విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయానే కారణంతోనే వారు తప్పించుకు తిరుగుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read : Krish Jagarlamudi : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో.. హరిహర వీరమల్లు దర్శకుడు కూడా..

మరోవైపు డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పై పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. క్రిష్ నిర్దోషి అని, ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకున్నా తప్పుడు ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. స్పందించిన కోర్టు.. క్రిష్ పిటిషన్ పై వైఖరేంటో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. విచారణను ఈనెల 4వ తేదీకి వాయిదా వేసింది. దీంతో క్రిష్ పిటీషన్ పై మరోసారి సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.