Drugs : అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ విక్రయం.. హైదరాబాద్‌లో కలకలం, విద్యార్థి అరెస్ట్

నూతన సంవత్సర వేడుకలను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయదారులు రెచ్చిపోతున్నారు. ప్రతీ ఏటా న్యూఇయర్ వేడుకల్లో మత్తు పదార్ధాల వినియోగం విరివిగా ఉందనే సమాచారం ఉంది. గతంలో కూడా హైదరాబాద్ నగరంలో అనేక డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయి. తాజాగా గడిచిన కొద్దిరోజులగా నగరంలో డ్రగ్స్ పట్టుబడుతోంది.

Drugs : అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ విక్రయం.. హైదరాబాద్‌లో కలకలం, విద్యార్థి అరెస్ట్

Hyderabad Police Busted Drugs Gangs

న్యూఇయర్ వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని సూరి లీల నవీన్ గా గుర్తించారు. అతడు పంజాబ్ ని ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్నాడు. నవీన్ తో పాటు వీర సాయి తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చారు నవీన్, సాయి.

నాలుగేళ్లుగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నవీన్ డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. నవీన్, సాయి ఢిల్లీ, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన నవీన్ పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. లోన్ యాప్ లో రుణాలు తీసుకున్నాడు. తీసుకున్న అప్పులు తీర్చేందుకు అడ్డదారి తొక్కాడు. డ్రగ్స్ అమ్ముతున్నాడు.

Also Read : న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసుల సరికొత్త ప్రయోగం.. ఇలా దొరికిపోతారంతే..

అటు.. జూబ్లీహిల్స్, ఎల్బీనగర్ ఏరియాల్లో పోలీసుల తనిఖీల్లో డ్రగ్స్ దొరికాయి. ఎల్బీనగర్ లో ఎస్వోటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. రాజస్తాన్ నుంచి డ్రగ్స్ తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. ముగ్గురు డ్రగ్స్ సప్లయర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, బ్రౌన్ షుగర్, కొకైన్ ను సీజ్ చేశారు. వీటి విలువ 7లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు కూడా హెరాయిన్ పట్టుకున్నారు.

నూతన సంవత్సర వేడుకలను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయదారులు రెచ్చిపోతున్నారు. ప్రతీ ఏటా న్యూఇయర్ వేడుకల్లో మత్తు పదార్ధాల వినియోగం విరివిగా ఉందనే సమాచారం ఉంది. గతంలో కూడా హైదరాబాద్ నగరంలో అనేక డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయి. తాజాగా గడిచిన కొద్దిరోజులగా నగరంలో డ్రగ్స్ పట్టుబడుతోంది. న్యూ ఇయర్ వేడుకులకు సంబంధించి నగరంలో పబ్బులతో పాటు నగర శివార్లలో భారీ పార్టీలు ప్లాన్ చేశారు. ఇందులో డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Also Read : న్యూ ఇయర్‌ వేళ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్.. మద్యం తాగి వస్తే మాత్రం..

డ్రగ్స్ విక్రేతలు, పెడ్లర్స్ పై పోలీసులు నిఘా పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫీ సిటీగా చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా పకడ్బందీగా ప్లాన్ చేసింది. డ్రగ్స్ మూలాలను అంతమొందించే ప్రయత్నం చేస్తోంది. ఈసారి నూతన సంవత్సర వేడుకల్లో లిక్కర్ తో పాటు భారీగా డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో డ్రగ్స్ అమ్మేవారితో పాటు వాటిని యూజ్ చేసే వారిని పట్టుకునేందుకు పోలీసులు కొత్త తరహాను ప్లాన్ చేశారు.