Ministar Gangula
Gangula Kamalakar: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ లోని చర్ల బూత్కూరులో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ తో పాటు పలువురు నేతలు దీనికి హాజరయ్యారు. ఆ సమయంలో గంగుల వేదికపై ఉండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది.
వేదికపై నుంచి మంత్రి గంగుల కమలాకర్ కిందపడిపోయారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వేదికపైకి చాలా మంది ఎక్కడంతో అది కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరికొందరికి కూడా గాయాలయ్యాయి. కాగా, అంతకుముందు గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణలో వేగవంతంగా వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు.
మధ్యవర్తులకు వరి పంటను విక్రయించొద్దని అన్నారు. మొత్తం 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వరి పంటకు తెలంగాణలో మాత్రమే మద్దతు ధర దక్కుతోందని చెప్పారు. రైతులకు రైస్ మిల్లర్ల నుంచి వేధింపులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రెండో పంట కొంటోందని వివరించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారాలను రైతులు నమ్మకూడదని గంగుల కమలాకర్ సూచించారు.
Puvvada Ajay Kumar: సీఎం కేసీఆర్‌తో ఎవరైనా పెట్టుకుంటే అంతే..: మంత్రి పువ్వాడ