Viral Video: భారత్‌లో కూరగాయలు కొనుక్కున్న జర్మనీ మంత్రి.. ఆ తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..

అక్కడి ఓ కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొన్నారు. అనంతరం పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించారు.

Viral Video: భారత్‌లో కూరగాయలు కొనుక్కున్న జర్మనీ మంత్రి.. ఆ తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..

Volker Wissing

Updated On : August 20, 2023 / 7:22 PM IST

Viral Video – Volker Wissing: భారత్‌(India)లో చిరు వ్యాపారులు సైతం యూపీఐ చెల్లింపుల సేవలను వినియోగించుకుంటుండడంపై జర్మనీ (Germany) ట్రాన్స్‌పోర్ట్, డిజిటల్ ఫెడరల్ మంత్రి వోల్కర్ విస్సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జీ20 డిజిటల్ శాఖల మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి విస్సింగ్ బెంగళూరుకి వచ్చారు.

అక్కడి ఓ కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొన్నారు. అనంతరం పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించారు. కూరగాయల వ్యాపారులు కూడా యూపీఐ చెల్లింపులు చేసుకునేంత డిజిటల్ విప్లవం భారత్ లో వచ్చిందని ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత్ లోని జర్మన్ ఎంబసీ పోస్ట్ చేసింది.

భారత విజయగాథల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా ఒకటని పేర్కొంది. ప్రతి ఒక్కరు క్షణాల్లో యూపీఐ చెల్లింపులు చేసుకునే సదుపాయం ఉందని చెప్పింది. కోట్లాది మంది భారతీయులు దీన్ని వాడుతున్నారని పేర్కొంది.

Rich People: కొవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరిగిన ధనవంతులు.. కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారి సంఖ్య తెలిస్తే షాకవుతారు