Girl
Girl raped in Hyderabad : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై జరిగిన అత్యాచార ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. నగరంలోని సంతోష్ నగర్ లో బాలికపై అత్యాచారం జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి పహాడీ షరీఫ్ లో అత్యాచారం చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై సౌత్ జోన్ డీసీపీ విచారణ చేపట్టారు. పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారు.
అత్యాచారం జరిగినట్లుగా బాధితురాలు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజీ అధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐఎస్ సదన్ లోని ప్రైవేట్ కంపెనీలో సదరు బాలిక పని చేస్తోంది.
ఐఎస్ సదన్ నుంచి చంద్రాయన్ గుట్టకు వెళ్లాల్సిన బాలిక అక్కడ ఆటో ఎక్కారు. చంద్రాయన్ గుట్ట నుంచి పహాడీ షరీఫ్ వెళ్తున్న సమయంలో తనపై అత్యాచారం జరిగినట్లు బాలిక వివరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కొద్ది సేపటి క్రితమే సంతోష్ నగర్ పీఎస్ కు సౌత్ జోన్ డీసీపీతోపాటు అడిషనల్ డీసీపీలు కూడా వెళ్లారు. బాధితురాలు నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దీనికి సంబంధించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవంగా గ్యాంగ్ రేప్ జరిగిందా? లేదా? ఎంతమంది అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారనేది తెలియాల్సివుంది. మరో సీసీ ఫుటేజీలో అమ్మాయి ఆటోలో వెళ్తున్నట్లు తెలుస్తోంది.