Telangana Government : రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు..రూ.50 వేల లోపు రుణాలు మాఫీ

తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది.

Cm Kcr

Telangana government : తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు మంత్రివర్గం ఆర్థికశాఖను ఆదేశించింది. రుణమాఫీ అమలుపై ఆదివారం (ఆగస్టు1, 2021)న కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ నెల 15 నుంచి రూ.50 వేల లోపు రైతు రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ ఆదేశించింది. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

ఇప్పటివరకు జరిగిన రుణమాఫీ వివరాలను ఆర్థిక శాఖ మంత్రివర్గానికి వివరించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్న ఆర్థిక శాఖ ఆ ఎఫెక్ట్ తో రెండేళ్లుగా రూ.25 వేల వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసినట్లు వివరించింది. వ్యవసాయ రంగంపై చర్చించింది.

మరోవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని ఆదేశించింది. అయితే రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు మాత్రమే అర్హులుగా తేల్చింది. ఈడబ్ల్యూఎస్ లకు ఉద్యోగ నియామకాల్లో గిరిష్ఠ వయోపరిమితి 5ఏళ్లకు సడలించింది.