Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మే మొదటి వారం నుంచి..

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రాధాన్యత, అప్లికేషన్లు, లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై..

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మే మొదటి వారం నుంచి..

Indiramma houses

Updated On : April 21, 2025 / 11:30 PM IST

Indiramma Housing Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ లలో ఇందిరమ్మ ఇళ్లు ఒకటి. ఈ స్కీమ్ లబ్దిదారులకు గుడ్ న్యూస్. త్వరలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఏఈ పోస్టులకు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు లింక్ ఏంటి అనే సందేహం రావొచ్చు. మ్యాటర్ ఏంటంటే.. ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం నాలుగు దశల్లో 5 లక్షల రూపాయల సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో బేస్ మెంట్ పూర్తైన ఇళ్లను ఏఈలు పరిశీలించి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఏఈ సర్టిఫై చేశాకే లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్ లో లక్ష రూపాయలు జమ అవుతాయి. అలా ఏఈ పోస్టులకు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు లింక్ ఉంది.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలు కోసం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 390 ఏఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. సుమారు 10 వేల అప్లికేషన్లు వచ్చాయి. ఇటీవలే సెలక్షన్ కూడా పూర్తైంది. ఈ నెల 23న వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఇక మే ఫస్ట్ వీక్ నుంచి కొత్త ఏఈలు విధుల్లోకి దిగనున్నారు.

హైదరాబాద్ మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ర్టక్షన్ ఆఫీసులో కొత్త ఏఈలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వారం పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రాధాన్యత, అప్లికేషన్లు, లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై కొత్త ఏఈలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వీరికి జీతం నెలకు 33వేల 800. సివిల్ ఇంజనీర్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లను మార్కుల్లో మెరిట్ ఆధారంగా రిక్రూట్ మెంట్ చేశారు.

Also Read : కాబోయే పోప్ ను ఎన్నుకోవడంలో ఓ తెలుగు వ్యక్తికీ ఓటు ఉంది.. ఆయన ఎవరంటే..

ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కు సంబంధించి ప్రతి మండలానికి ఒక ఏఈని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీజీపీఎస్సీ ద్వారా ఏఈల నియామకం చేపట్టాలంటే సుమారు ఏడాది సమయం పడుతుంది. అయితే స్కీమ్ ను అమలు చేయాలంటే ఏఈల రోల్ చాలా కీలకం. దాంతో ముందుగా ఏడాది పాటు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఏఈలను నియమించుకోవాలని, అంతలోపు టీజీపీఎస్ సీ ద్వారా ఏఈ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందట.

రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 70వేల 122 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసింది. ఇందులో సుమారు 7 వేల మంది అనర్హులు. వారికి ఇళ్లను రద్దు చేశారు. మిగతా 63 వేల మంది అర్హుల్లో 25వేల మంది ముగ్గులు పోశారు. ఇప్పటివరకు సుమారు 2వేల 500 మంది బేస్ మెంట్ వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. బేస్ మెంట్ పూర్తి చేసిన వారిలో 2,019 మంది లబ్ధిదారులకు తొలి విడత సాయం లక్ష రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here