MLA Rajasingh Demand Financial Assistance : కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలి : ఎమ్మెల్యే గోషామహాల్

హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం‌ బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.

MLA Rajasingh Demand Financial Assistance : హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం‌ బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. రాజకీయాలు పక్క‌న పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ కు సూచించారు. తన ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలన్నారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. నాలుగేళ్ళ బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.

నగరంలోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు చిన్నారి తన శక్తి మేర ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. జంతువును వేటాడినట్టుగా కుక్కలన్నీ కలిసి చిన్నారిని అన్నివైపుల నుంచి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ కు వలస వచ్చాడు.

Dogs Attack Boy Died : హైదరాబాద్ అంబర్ పేటలో దారుణం.. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

నగరంలోని అంబర్ పేట ‘చే నెంబర్’ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నారు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి అంబర్ పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో గంగాధర్ ఇద్దరు పిల్లలను వెంట బెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్ కు వెళ్లాడు.

కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్ లో ఉంచి, కుమారున్ని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటుూవుండటంతో మరో వాచ్ మెన్ తో కలిసి గంగాధర్ పని మీద బయటికి వచ్చాడు. అయితే, కాసేపు అక్కడే ఆడుకున్న బాలుడు ప్రదీప్.. తర్వాత అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడి దాడి చేసి, చంపేశాయి.

ట్రెండింగ్ వార్తలు