KTR
Gossip Garage : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏం జరుగుతోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ఖాయమా..? ఏసీబీ విచారణలో ఏం తేలింది? ఏసీబీ అధికారులు సంధించిన ప్రశ్నలేంటి? కేటీఆర్ చెప్పిన సమాధానలేంటి? ఆరుగంటల పాటు విచారించిన ఏసీబీ.. మళ్లీ విచారణకు పిలుస్తుందా..?
ట్విస్టులు, ఝలక్‌లు, టెన్షన్‌లు.. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కనిపిస్తున్నవి ఇవే ! సంబంధం లేని కేసు అని కేటీఆర్.. అంతా కేటీఆరే చేశారని ఏసీబీ. ఈ కేసులో కనిపిస్తున్న మలుపులు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి పరిణామాల మధ్య కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఆరు గంటల పాటు విచారించారు.
కార్నర్ అవుతూ వస్తున్న కేటీఆర్..
పిటిషన్ల కొట్టివేత, విచారణల పిలుపుతో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మొత్తం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్నర్ అవుతూ వస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫార్ములా ఈ కార్ రేస్ రేస్ వ్యవహారంలో అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డారని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Also Read : వైసీపీని వెంటాడుతున్న కొత్త సమస్య..! ఆ నియోజకవర్గం జగన్‌కు తలనొప్పిగా మారిందా..?
అందుకు అనుకూలంగా కేటీఆర్‌పై ఏసీబీ సహా ఈడీ కేసులను నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. అటు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లినా కేటీఆర్‌కు రిలీఫ్ లభించలేదు.
కేటీఆర్ ఏ మేరకు నిజాలు చెప్పారు?
ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏసీబీ విచారణ ప్రారంభించింది. కేటీఆర్ తన అడ్వకేట్‌తో సహా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్పారు. ఐతే ఏసీబీ అధికారులు నేరుగా అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఏ మేరకు నిజాలు చెప్పారన్నది సందిగ్ధంగా మారింది. ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల మేరకే నడుచుకున్నామని కేటీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
BRS working president KTR attends ACB inquiry into Formula E-car race
అరవింద్ కుమార్ స్టేట్ మెంట్ ఆధారంగా ఎంక్వైరీ..
ఏసీబీ విచారణలో ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కార్ రేస్ వ్యవహారంలో పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపల్ శాఖ మంత్రి చెప్పిందే తాము చేశామని, అందులో తమ ప్రమేయం ఏమీ లేదని అరవింద్ కుమారు చెప్పినట్లు సమాచారం. అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా చేసుకొని ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నలు సంధించారు.
ఈ కార్ రేస్ వ్యవహారంలో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయని, అందులో కేటీఆర్ పాత్ర స్పష్టంగా ఉందని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. లోతుగా విచారణ చేస్తోంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇలాంటి సమయంలో కేటీఆర్ విషయంలో ఏం జరగబోతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేటీఆర్ ను అరెస్ట్ చేసి తీరాలన్న తెలంగాణ ప్రభుత్వ పంతం నెగ్గుతుందా.. లేదంటే న్యాయం తన వైపు ఉందంటున్న కేటీఆర్ పంతం నెగ్గించుకుంటారా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఈ నెల 16న ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా..? ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : ‘గేమ్‌ఛేంజర్’కు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం వెనుక మతలబు ఏంటి? : రసమయి బాలకిషన్