Rasamayi Balakishan : ‘గేమ్‌ఛేంజ‌ర్‌’కు ప్ర‌త్యేక మిన‌హాయింపులు ఇవ్వ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంటి? : రసమయి బాలకిషన్

తెలంగాణ‌ ప్ర‌భుత్వం పై మానకొండూర్‌ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రసమయి బాలకిషన్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Rasamayi Balakishan : ‘గేమ్‌ఛేంజ‌ర్‌’కు ప్ర‌త్యేక మిన‌హాయింపులు ఇవ్వ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంటి? : రసమయి బాలకిషన్

BRS Leader Rasamayi Balakishan Comments on Ticket Price Hike for Ram Charan's Game Changer Movie

Updated On : January 9, 2025 / 2:28 PM IST

Game Changer Ticket Price Hike: తెలంగాణ‌ ప్ర‌భుత్వం పై మానకొండూర్‌ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రసమయి బాలకిషన్ విమ‌ర్శ‌లు గుప్పించారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల‌పై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్ర‌క‌టన ఉత్త‌దే అని తేలిపోయిందన్నారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమా గేమ్ చేంజర్ కు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం వెనక మతలబు ఏమిటీ అని ప్ర‌శ్నించారు.

ఆరు గ్యారెంటీల‌పై మాట త‌ప్పిన‌ట్లే సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ముఖ్య‌మంత్రి మాట త‌ప్పార‌న్నారు. సీఎం రేవంత్.. దిల్ రాజుకు ఎంతకు అమ్ముడు పోయారని విమ‌ర్శించారు. మంత్రి కోమ‌టిరెడ్డి వెంకట్‌ రెడ్డి బెనిఫిట్ షో లపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించారన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్ట‌డం తప్ప రేవంత్ కి ఏదీ చేత కావ‌డం లేద‌న్నారు. అన్నింటిపై రేవంత్ యూట‌ర్న్ తీసుకుంటున్నార‌ని, ప్ర‌జ‌లు బుద్ది చెప్పే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు.

కేటీఆర్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులెవరో తెలుసా..? ఎన్ని ప్రశ్నలు రెడీ చేశారంటే..

రేవంత్‌ది రెండు నాల్కల ధోరణి

సీఎం రేవంత్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయట పడింద‌ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలిపారు. గేమ్ ఛేంజర్ సినిమాకి ప్రత్యేక మినహాయింపులు ఎందుకు ఇచ్చార‌న్నారు. మొద‌టి నుంచి దిల్ రాజు తెలంగాణ వ్య‌తిరేకి అని తెలిపారు. తెలంగాణలో కల్లు, మటన్ కే వైబ్ ఉంటుంది అన్న దిల్ రాజు తెలంగాణ లో సినిమా లు ఎందుకు విడుదల చేయాలి ?రేట్లు ఎందుకు పెంచాలి ? అని ప్రశ్నించారు.

కోమటి రెడ్డి బెనిఫిట్ షో ల పై పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, తెలంగాణ సంస్కృతి పై రేవంత్ ప్రభుత్వం దాడిని ఖండిస్తున్నామ‌ని చెప్పారు. మాట మీద నిలబడని రేవంత్ తీరును ప్రజలు గ‌మ‌నించాల‌ని కోరారు.

KTR: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు

గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపు..

ఇటీవల సంధ్య థియేటర్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి టికెట్ రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమని అన్నారు. అయితే నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల కోసం సీఎంని కలిశారు. ఈ క్ర‌మంలో టికెట‌ రేట్లు పెంచుతూ పర్మిషన్ ఇచ్చారు. అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో అడగ్గా రిజెక్ట్ చేశారు. జనవరి 10న తొలి రోజు ఉదయం 4 నుంచి ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చారు. మొదటి రోజు మల్టీప్లెక్స్ లలో 150, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు. జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు అనుమతి ఇస్తూ మల్టీప్లెక్స్ లలో 100, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.