KTR: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

KTR: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు

Updated On : January 9, 2025 / 10:36 AM IST

E Car Race Scam: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. నందినగర్ లోని తన నివాసం నుండి తన అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి ఏసీబీ కార్యాలయంకు కేటీఆర్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే నేను ప్రయత్నించాను.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి ప్రయత్నించాను.. ఈ క్రమంలోనే ఈ కార్ రేసు నిర్వహించామని తెలిపారు. మంత్రిగా ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదు.. దానికి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదు. ఆ తేలివేతలు ముఖ్యమంత్రి రేవంత్, ఆయన మంత్రి సహచరులకే ఉన్నాయంటూ కేటీఆర్ విమర్శించారు.

Also Read: KTR: ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్.. భారీ బందోబస్తు.. ఏం జరగబోతుంది?

మంత్రిగా మా బామర్దులకు కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం నేను చేయలేదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. అరపైసా కూడా అవినీతి చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంకా ఎన్ని కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొంటానని చెప్పారు. తెలంగాణ బిడ్డగా.. రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగా స్పష్టంగా చెబుతున్నా.. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం స్థాయిని పెంచేందుకు పనిచేశాం. మేము కుటుంబం కోసం పనిచేయలేదు. నేను 50లక్షల డబ్బుతో ఎమ్మెల్యేలనుకొని దొరికిన దొంగను కాదు అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నేను కేసీఆర్ సైనికుడిని.. ఏ ప్రశ్నలు అడిగిన చెప్త.. తెలంగాణ కోసం చస్తాను తప్ప తల వంచను అంటూ కేటీఆర్ అన్నారు.

Also Read: Gossip Garage : కేసీఆర్ రీఎంట్రీ అప్పుడేనా? రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలకు బీఆర్ఎస్ రూట్ మ్యాప్ రెడీ..!

ట్విటర్ లో ఆసక్తికర పోస్ట్..
కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు ట్వీట్టర్ లో ఆసక్తికర పోస్టు చేశారు.. ‘‘ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించడానికి, భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ను తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేశాం.  ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్ ను గమ్యస్థానంగా మార్చడమే ఎజెండాగా ఫార్ములా ఈ కారు రేస్ ను తీసుకొచ్చాం. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్, తయారీ రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2023 ఈ-మొబిలిటీ వీక్ లో 12,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగాం. నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్ధం కాలేదు. కానీ, విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసు. మా ప్రభుత్వ విజన్, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. సత్యం, న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తుందని కేటీఆర్ అన్నారు.