Gossip Garage : కేసీఆర్ రీఎంట్రీ అప్పుడేనా? రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలకు బీఆర్ఎస్ రూట్ మ్యాప్ రెడీ..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని గెలవడం ద్వారా మళ్లీ గులాబీ క్యాడర్‌లో నమ్మకాన్ని, జోష్‌ను నింపాలని కేసీఆర్ భావిస్తున్నారట.

Gossip Garage : గులాబీ బాస్ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? ఫామ్ హౌజ్ వీడే సమయం అసన్నమైందా? సంక్రాంతి తర్వాత మాజీ సీఎం రంగంలోకి దిగబోతున్నారా? బీఆర్‌ఎస్ నేతలు మళ్లీ యాక్టీవ్ మోడ్‌లోకి వచ్చేసినట్టేనా.. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై కేసీఆర్ సెంట్రిక్‌గా నడుస్తున్న చర్చ ఏంటి..
కొన్నాళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం..
కేసీఆర్. మూడు అక్షరాల ఈ పదం ఓ సంచలనం. అతడే ఓ సైన్యం. అతడే ఆ పార్టీకో నమ్మకం. అలాంటి దళపతి కొన్నాళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన మాత్రం మౌనం వీడలేదు. దీంతో క్యాడర్ డీలా పడిపోతోంది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే దండుగా కదిలే వారు. కానీ ఇప్పుడు కేసీఆర్ వాయిస్ వినిపించకపోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. పార్టీ కార్యక్రమాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పెద్దగా బయటకు వచ్చింది లేదు. మైక్ పట్టింది లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాలి తుంటికి గాయం కావడంతో రెస్ట్ తీసుకున్నారు కేసీఆర్. గాయం నుంచి పూర్తిగా కోలుకోక ముందే.. కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతుందంటూ నల్గొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు.
ఫామ్‌హౌజ్ గేటు దాటింది లేదు…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ రోజు సభకు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్యాడర్, లీడర్లతో అప్పుడప్పుడు ఫాంహౌస్‌లో పిచ్చాపాటి సమావేశాలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు కేసీఆర్. ఎవరైనా ముఖ్యనేతలు కలవాలన్నా అక్కడికే పిలిపించుకుని మాట్లాడుతున్నారు తప్ప.. కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌజ్ గేటు దాటింది లేదు.
Also Read : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో కింగ్ ఫిషర్, హైన్‌కెన్ బీర్లు బంద్.. ఎందుకంటే?
సంక్రాంతి తర్వాత కేసీఆర్ బయటకు వస్తారనే గాసిప్ మళ్లీ మొదలు..
కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలు చేసినా.. బీఆర్‌ఎస్ నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తున్నా కేసీఆర్ సైలెంట్‌గానే ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలనకు ఏడాది పూర్తయ్యాక అధినేత రంగంలోకి దిగుతారని ఇన్నాళ్లు నేతలు చెప్పుకుంటూ వచ్చారు. డిసెంబర్ 7నాటికి రేవంత్ సర్కార్‌కి ఏడాది గడిచిపోయింది. అయినా కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌజ్ విడిచి రాకపోవడంతో పార్టీ నేతలు, క్యాడర్ పూర్తిగా డైలమాలో పడిపోయారు. ఐతే సంక్రాంతి తర్వాత కేసీఆర్ బయటకు వస్తారనే గాసిప్ మళ్లీ మొదలైంది.
కేసీఆర్ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూపులు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు బిగుస్తుండడంతో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. తాను రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారని పార్టీలో ఇన్నర్ టాక్ నడుస్తోంది. కేసీఆర్ రాక కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయ్యింది. ఇక యాక్టీవ్ కావాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ అనుకుంటున్నారట. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలుపుకోవడంలో విఫలమైందని భావిస్తున్న కేసీఆర్.. ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్.. బిగ్ సౌండ్ చేస్తోంది. అనుకోని పరిస్థితుల్లో ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ నీరుగారిపోకుండా తాను నేతలకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉండదని కేసీఆర్ ఫిక్స్ అయ్యారట.

KTR
ఇక నుంచి తెలంగాణ భవన్‌లో అందరికి అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట కేసీఆర్. సంక్రాంతి తర్వాత దళపతి ఫీల్డ్‌లోకి దిగుతారని అంటున్నారు. అప్పటి నుంచి రెగ్యులర్‌గా పార్టీ క్యాడర్, లీడర్లతో రెగ్యులర్‌గా మాట్లాడతారని..పార్టీ యాక్టివిటీ ఇంకా పెరిగిపోతుందని చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల్ని చేపట్టేందుకు కేసీఆర్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని గెలవడం ద్వారా మళ్లీ గులాబీ క్యాడర్‌లో నమ్మకాన్ని, జోష్‌ను నింపాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ఇటు పార్టీని కాపాడుకుంటూనే, అటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కేసీఆర్ వ్యూహరచనతో వస్తున్నారట.
ప్రభుత్వం తమపై పెడుతున్న కేసులను ఎదుర్కోవడానికి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. గులాబీ బాస్ రీఎంట్రీ అని టాక్ మొదలైనప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇదే నిజమైతే కార్యకర్తులు ఫుల్ యాక్టీవ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : కేసీఆర్ రంగంలోకి దిగే సమయం వచ్చేసిందా..? కేటీఆర్ అరెస్ట్ అయితే.. కారు స్టీరింగ్‌ను తీసుకునే చేతులేవి..