కేటీఆర్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులెవరో తెలుసా..? ఎన్ని ప్రశ్నలు రెడీ చేశారంటే..
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో నిందితుడగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

BRS working president KTR attends ACB inquiry into Formula E-car race
ACB Questions KTR: ఫార్ములా ఈ-కారు రేసు (Formula E-Car Race) లో నిందితుడగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గురువారం బంజారాహిల్స్ లోని ఏసీబీ (ACB) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు సూచనల మేరకు తన న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్లారు. ఉదయం 10 గంటల సమయంలో నందినగర్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్.. మూడు వాహనాల్లో తన అనుచరులతో కలిసి ఏసీబీ కార్యాలయంకు వెళ్లారు. అయితే, ఏసీబీ కార్యాలయంలోకి కేటీఆర్ తో పాటు తన అడ్వకేట్ రామచంద్రరావు, కేటీఆర్ డ్రైవర్, పీఏ, ఒక గన్ మెన్ ను ఏసీబీ అధికారులు అనుమతించారు. అనంతరం కేటీఆర్ తన లాయర్ తో కలిసి విచారణ గది వద్దకు వెళ్లారు. విచారణ జరిగే గది పక్కన ఉన్న లైబ్రరీ రూమ్ వరకు మాత్రమే కేటీఆర్ న్యాయవాదికి అనుమతి ఇచ్చారు.
Also Read: KTR: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ విచారణ సీసీటీవీ పర్యవేక్షణలో కొనసాగనుంది. హైకోర్టు సూచనల మేరకు కేటీఆర్ అడ్వకేట్ ఏసీబీ అధికారుల విచారణను దూరంగా ఉండి చూడనున్నారు. అయితే, ఆయనకు విచారణ సమయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. కేటీఆర్ ను ముగ్గురు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వీరిలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఉన్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ అధికారులు 40 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా బుధవారం అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు, దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలిసింది. ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థలకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై కేటీఆర్ ను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక.. అందులో ఏముందంటే?
కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతకుముందు పోలీసులు పలువురు బీఆర్ఎస్ నేతలను గృహనిర్భందం చేశారు. అయితే, కేటీఆర్ విచారణకు వెళ్తున్న క్రమంలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.. రేవంత్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మా బావమరుదులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదు. మంత్రి హోదాలో ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదు. కాంట్రాక్టులు అప్పగించినందుకు ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదు. ఆ తెలివితేటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులకే ఉన్నాయంటూ కేటీఆర్ విమర్శించారు.’’
ఏసీబీ అధికారుల ప్రశ్నలు కొన్ని ఇలా.. (అంచనా)
♦ అరవింద్ కుమార్, దాన కిశోర్ ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏసీబీ అధికారులు.
♦ హెచ్ఎండీఏ నుంచి నిధులు బదిలీ చేయాలని అధికారులను ఎందుకు ఆదేశించారు..?
♦ ఎంత మొత్తంలో నిధులను ట్రాన్స్ ఫర్ చేశారు?
♦ లిఖితపూర్వక ఆదేశాలేమైనా ఇచ్చారా?
♦ లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా నిధుల బదిలీ ఎందుకు జరిగింది?
♦ అధికారిక ఆదేశాలు లేకుండా ఎందుకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
♦ ప్రభుత్వానికి తెలియకుండా ఈ నిధుల బదిలీ జరిగిందా?
♦ ఒకవేళ తెలియకుండా జరిగితే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
♦ ఫెమానిబంధనలను ఉల్లంఘించి మరీ ఎందుకు నిధులు చెల్లించారు.?
♦ ఈ అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా?
♦ ఒకవేళ తీసుకొస్తే ప్రభుత్వం ఎలా స్పందించింది?
♦ కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు?
♦ దీనికి కేబినెట్ అనుమతి ఉందా? లేదా?
♦ క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే అగ్రిమెంట్ జరిగిందా?
♦ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా?
♦ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగింది.?