Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు.. ప్రతి సోమవారం నిధుల విడుదల..
ఇందిరమ్మ ఇళ్లకు ఆర్ధిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇందిరమ్మ ఇళ్లను..

Indiramma housing scheme
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 20,104 ఇళ్ల గ్రౌండింగ్ జరిగింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా బేస్ మెంట్, గోడలు పూర్తి చేసుకున్నవి 5,364 ఇళ్లు. ఇందుకు గాను రూ.53.64 కోట్లు చెల్లింపులు చేశారు. 5140 ఇళ్లు బేస్‌మెంట్, 300 ఇళ్ల గోడల నిర్మాణం అయ్యింది. మరో 10 ఇళ్లు శ్లాబ్‌ల వరకు పూర్తయ్యాయి.
ప్రతి సోమవారం నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్లకు ఆర్ధిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది ప్రభుత్వం. మధ్యవర్తుల ప్రమేయానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. నాలుగు విడతల్లో లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే నగదు జమ చేయనుంది ప్రభుత్వం.
Also Read: బాబోయ్.. భారత్‌లో మళ్లీ కరోనా కలకలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే..
బేస్ మెంట్ పూర్తైన తర్వాత లక్ష రూపాయలు, గోడలు పూర్తైన తర్వాత 1.25 లక్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత 1.75 లక్షల రూపాయిలు, మొత్తం ఇల్లు పూర్తైన తర్వాత మిగిలిన లక్ష రూపాయిలు విడుదల చేయనుంది. వాన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది సర్కార్. ప్రతి సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్దిదారుల చెల్లింపులపై అధికారులతో సమీక్షించనున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.